Nara Rohith's Sundarakanda OTT Platform Locked: యంగ్ హీరో నారా రోహిత్ తాజాగా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సుందరకాండ'తో రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఆగస్ట్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ముందే సినిమా ఓటీటీ డీల్ కూడా ఫిక్స్ అయ్యింది.

ఆ ఓటీటీలోకి...

'సుందరకాండ' డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ 'జియో హాట్ స్టార్' కొనుగోలు చేసింది. సంస్థకు చెందిన 3 టీమ్స్ మూవీని చూసి కంటెంట్ బాగా నచ్చడంతో ఈ డీల్ ఫిక్స్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా 'భైరవం'తో ఓ మోస్తరు సక్సెస్ అందుకున్న నారా రోహిత్... 'సుందరకాండ'తో హిట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు.

నారా రోహిత్‌కు ఇది 20వ చిత్రం కాగా... వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రోహిత్ సరసన శ్రీదేవి విజయ్ కుమార్‌తో పాటు వ్రితి వాఘని హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సీనియర్ యాక్టర్ నరేష్ ఓ కీలక రోల్ పోషించగా... అభినవ్ గోమటం కీలక పాత్రలో నటించారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించగా... ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ 'బహుశా బహుశా' ట్రెండింగ్ లో నిలిచింది. టీజర్ సైతం మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

Also Read: ప్రొడ్యూసర్ కమ్ హీరోను చెప్పుతో కొట్టిన హీరోయిన్ - అసలు రీజన్ ఏంటంటే?

ఫన్నీ వీడియోతో... రిలీజ్ డేట్

ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. శుక్రవారం నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఫన్నీ వీడియోతో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇందులో నరేష్, అభినవ్ గోమటం, నారా రోహిత్ సందడి చేశారు. 'సినిమా తీసి దాచుకోవడం ఏంటి మమకారమా?' అంటూ నరేష్ సెటైరికల్ కౌంటర్ వేయగా... 'మమకారం కాదు సార్. మంచి డేట్ కోసం వెతుకుతున్నాం.' అంటూ ఆగస్ట్ 27 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు రోహిత్. ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఓ యువకుడు పెళ్లి వయసు దాటిపోయినా తనకు నచ్చిన తాను మెచ్చిన 5 క్వాలిటీస్ ఉన్న సరైన పార్ట్‌నర్ కోసం ఎదురుచూడడం ప్రధానాంశంగా మూవీని తెరకెక్కించారు. నారా రోహిత్ సినిమాలో 'సింగిల్ మ్యాన్' రోల్‌లో కనిపించారు. యువకుని పేరెంట్స్ అలాంటి అమ్మాయి కోసం వెతికి విసిగిపోవడం వంటి అంశాలను మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా నారా రోహిత్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఈ మూవీలో సూపర్ హిట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు.