Kajol's Maa Movie OTT Streaming: హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఉండే క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఓటీటీ ఆడియన్స్ ఎక్కువగా అలాంటి కంటెంట్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బాలీవుడ్ హీరోయిన్ 'కాజల్' ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ 'మా' (Maa) ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూన్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు 2 నెలల తర్వాత ఓటీటీలో సందడి చేస్తోంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో శుక్రవారం (ఆగస్ట్ 22) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి విశాల్ పురియా దర్శకత్వం వహించగా... జియో స్టూడియోస్, దేవ్ గన్ ఫిల్మ్స్ నిర్మించారు. కాజల్‌తో పాటు ఇంద్రనీల్ సేన్ గుప్తా, ఖేరిన్ శర్మ, రోనిత్ రాయ్, భరద్వాజ్, దివ్యేందు భట్టాచార్య, సూరజ్ శిఖా దాస్ కీలక పాత్రలు పోషించారు. 2024లో వచ్చిన 'సైతాన్'లో ఇంట్రడ్యూస్ చేసిన మైథలాజికల్ స్టోరీ ప్రపంచాన్ని వివరిస్తూ స్పిన్ ఆఫ్‌గా 'మా' మూవీని రూపొందించారు. 

Also Read: ఆ ఫ్యామిలీ దాచిన సీక్రెట్ ఏంటి? - రెండు ఓటీటీల్లో మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

స్టోరీ ఏంటంటే?

ఓ రాక్షసుడి బారి నుంచి తన కుమార్తెతో పాటు ఆ ఊరి అమ్మాయిలను ఓ మహిళ ఎలా కాపాడింది అనేదే 'మా' మూవీ స్టోరీ. హారర్, మైథలాజికల్, థ్రిల్లర్ ఇలా అన్నీ అంశాలను కలగలిపి మూవీని రూపొందించారు. కథ విషయానికొస్తే... అంబిక (కాజల్) అనే ఓ తల్లి చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. ఆమె భర్త శుభంకర్ (ఇంద్రనీల్ సేన్ గుప్తా) మరణంతో ఆమె జీవితం తలక్రిందులు అయిపోతుంది. అతని ఆస్తి సంబంధ విషయాలు సెటిల్ చేసుకునేందుకు తన చిన్న కూతురు శ్వేత (ఖేరిన్ శర్మ)తో కలిసి చంద్రపూర్ అనే ఊరికి వెళ్తుంది.

అయితే, అప్పటికే ఆ ఊరంతా గందరగోళంలో ఉంటుంది. ఆ గ్రామంలో అప్పటికే కొంతమంది యువతులు అదృశ్యం అవుతారు. చాలా ఏళ్లుగా అక్కడ ఏదో అదృశ్య శక్తి గ్రామస్థులను భయపెడుతుందన్న విషయం తెలుసుకుంటారు. గ్రామంలో మొదటిసారి రుతుస్రావం అయిన అమ్మాయిలు ఓ రాక్షసుడికి లొంగిపోతారని తెలుసుకుంటుంది అంబిక. ఆమె కుమార్తె శ్వేత కూడా రాక్షసుడి బారిన పడుతుంది. ఆ రాక్షసుడి ఆత్మ ఓ చెట్టులో ఉందని చెప్పుకుంటుంటారు గ్రామస్థులు. తన కుమార్తెతో పాటు గ్రామంలో అదృశ్యమైన మిగిలిన అమ్మాయిలను కూడా రక్షించేందుకు ఆ రాక్షసుడితో పోరాడాలని నిశ్చయించుకుంటుంది అంబిక. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిణామాలేంటి? దైవ శక్తి ఆమెకు ఏ విధంగా సహాయపడింది? రాక్షసుడిని మట్టుబెట్టి తన కుమార్తె అమ్మాయిలతో పాటు ఆ గ్రామాన్ని రక్షించిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.