Legend Saravanan's Leader OTT Release Date Locked : ప్రముఖ బిజినెస్ మ్యాన్, లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లీడర్'. ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Continues below advertisement

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో లీడర్ మూవీ మే 29 నుంచి అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన అరుళ్ శరవణన్ 'ది లెజెండ్' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత యాక్షన్ జానర్‌‌లో లీడర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Continues below advertisement

మూవీలో శరవణన్‌తో పాటు పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, వీటీవీ గణేశ్, అమృత అయ్యర్, ఐశ్వర్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. లెజండ్ శరవణ స్పోర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మించగా... జిబ్రాన్ వైభోద మ్యూజిక్ అందించారు.

Also Read : లావణ్య త్రిపాఠి సతీ లీలావతి రిలీజ్ డేట్ ఫిక్స్ - ట్రెండీ సెన్సిటివ్ ఇష్యూ చూడాల్సిందే...

స్టోరీ ఏంటంటే?

శక్తివేల్ (శరవణన్)కు కూతురు అయిరేని (ఇయల్) అంటే పంచ ప్రాణాలు. తూత్తుకుడిలో కారు మెకానిక్‌గా పని చేస్తుంటాడు. ఆ పాపకు వినికిడి లోపం కారణంగా ఏదీ వినిపించదు. దీంతో చిన్నారికి ఆపరేషన్ చేయించాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. కానీ, ఈలోగా పోలీస్ అధికారిణి ఇంద్రా సత్యమూర్తి (ఆండ్రియా) తూత్తుకుడి పోర్టులో సాల్ట్ (బాహుబలి ప్రభాకర్) చేసే అక్రమ కార్యకలాపాల్ని బయట  పెట్టేందుకు శక్తివేల్ సాయం కోరుతుంది. అతని షెడ్డులోకి రిపేర్ కోసం వచ్చే సాల్ట్‌కు చెందిన కారులో ఓ ఆడియో బగ్ పెట్టమని బలవంతం చేస్తుంది.

కానీ అందుకు శక్తివేల్ ఒప్పుకోడు. దీంతో ఓ రోజు అతని బిడ్డను దాచి పెట్టిన ఇంద్రా సాల్ట్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని డ్రామా ఆడి.. అతన్ని రౌడీ మూకలపై తిరగబడేలా చేస్తుంది. ఆ పోర్టులో పేలుడు పదార్థాలతో నిండిన ఓ భారీ కంటెయినర్‌ను పట్టుకుంటుంది. అయితే, పోలీసుల చేతికి చిక్కిన కంటెయినర్‌ను తనకు తెచ్చి ఇవ్వకుంటే తన కూతుర్ని చంపేస్తానంటూ శక్తివేల్‌ను బెదిరిస్తాడు సాల్ట్. ఈ క్రమంలో శక్తివేల్ ఏం చేశాడు? ఎలా తన కూతుర్ని కాపాడుకున్నాడు? కంటైనర్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ డెవిల్ (సంతోష్ ప్రతాప్)కు ఉన్న సంబంధం ఏంటి? డెవిల్‌కు శక్తివేల్‌కు ఉన్న విరోధం ఏంటి? అసలు డెవిల్‌కు గతం ఏమైనా ఉందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.