Lavanya Tripathi's Sathi Leelavathi Release Date Locked : మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సతీ లీలావతి'. ఈ మూవీకి భీమిలి కబడ్డీ జట్టు ఫేం తాతినేని సత్య దర్శకత్వం వహిస్తుండగా... తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీని మే 8న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ హైప్ క్రియేట్ చేస్తుండగా... త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది. మిక్కీ జే మేయర్ సినిమాకు మ్యూజిక్ అందించారు. 

రెండు వేర్వేరు కుటుంబాలు, నేప‌థ్యాల నుంచి వచ్చిన వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణించాలంటే వారి మ‌ధ్య ఎమోష‌న్స్ ఇంకెంత బ‌లంగా ఉండాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇలాంటి సెన్సిటివ్ అంశాన్ని స‌తీ లీలావ‌తి చిత్రంలో ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య‌. భార్య‌ా భ‌ర్తల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గా చెప్పే ప్ర‌య‌త్న‌ం చేశారు. భార్యల చేతిలో గృహ హింస ఎదుర్కొనే భర్తల కష్టాలను ఫన్ మోడ్‌లో చూపించారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాను రూపొందించామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

Also Read : గ్లోబల్ స్క్రీన్‌పై వారణాసి ఎక్స్‌క్లూజివ్ వీడియో - మెక్సికో ఈవెంట్‌లో రాజమౌళి మెసేజ్ వైరల్ 

Sathi Leelavathi Cast And Crew : లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్‌, న‌రేశ్ వి.కె, స‌ప్త‌గిరి, వీటీవీ గ‌ణేశ్‌, మొట్ట రాజేంద్ర‌న్‌, జాఫ‌ర్‌, జోషి త‌దిత‌రులు. 

సాంకేతిక వ‌ర్గం : స‌మ‌ర్ప‌ణ‌ : ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, బ్యాన‌ర్స్‌ : దుర్గాదేవి పిక్చ‌ర్స్, నిర్మాత‌ : నాగమోహ‌న్, ద‌ర్శ‌క‌త్వం : తాతినేని స‌త్య‌, సంగీతం : మిక్కీ జె.మేయ‌ర్‌, DOP : బినేంద్ర మీన‌న్‌, డైలాగ్స్ : ఉద‌య్ పొట్టిపాడు, ఆర్ట్‌ : కోసనం విఠల్, ఎడిట‌ర్‌ : స‌తీష్ సూర్య‌.