Mahesh Babu Priyanka Chopra Pics With Choreographer Bosco Martis : వారణాసి... యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విజువల్ వండర్. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి కాంబోలో వస్తోన్న ఈ భారీ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా... తాజాగా ఓ సాంగ్‌ను కంప్లీట్ చేశారు.

Continues below advertisement

మహేశ్, ప్రియాంక చోప్రాలపై...

మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాలపై ఒక డ్యాన్స్ సీక్వెన్స్‌ను తాజాగా షూట్ చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ప్రియాంక, మహేశ్‌లతో బోస్కో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో మొత్తం 5 పాటలుంటాయని గతంలోనే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తెలిపారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సంచారి సాంగ్ ట్రెండ్ అవుతోంది.

Continues below advertisement

ఇప్పటికే షూటింగ్ చాలా భాగం కంప్లీట్ అయ్యింది. విలన్ రోల్ రణ కుంభ షూట్ పార్ట్ పూర్తి కాగా... త్వరలోనే మిగిలిన భాగం కంప్లీట్ చేసి VFX, మ్యూజిక్ వర్క్స్‌పై రాజమౌళి ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గానే హైదరాబాద్‌లో అండర్ వాటర్ సీక్వెన్స్ షూట్ కంప్లీట్ చేసినట్లు సమాచారం. 

Also Read : క్రిస్మస్‌కు కింగ్ సందడి షురూ - బాలీవుడ్ బాద్ షా, దీపిక యాక్షన్ సీక్వెన్స్

మెక్సికో ఈవెంట్‌లో గ్లింప్స్

రిలీజ్‌కు ముందే వారణాసి రికార్డులు క్రియేట్ చేస్తోంది. మెక్సికో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్ (CCXP - Comic Con Experience) ఈవెంట్‌లో గ్లింప్స్‌ను ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. గ్లోబల్ ప్లాట్ ఫాంపై రాజమౌళి నెక్స్ట్ లెవల్‌లో మూవీని ప్రమోట్ చేస్తున్నారు. కేవలం ఫస్ట్ గ్లింప్స్‌తోనే హాలీవుడ్ రేంజ్ హైప్ క్రియేట్ కాగా... ప్రమోషనల్ ఇంటర్వ్యూలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 

ఈ ఈవెంట్‌లో రాజమౌళి అక్కడి ఆడియన్స్‌ను ఉద్దేశించి వీడియో మెసేజ్ అందించారు. 'వారణాసి' టీ షర్ట్ ధరించి మరీ వారిని అడ్రెస్ చేశారు. ఇందులో బాహుబలి గురించి కూడా ప్రస్తావించారు. మాయా నాగరికత, సంస్కృతి తనను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయని చెప్పారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.