Latest Telugu Movies OTT Streamings: లేటెస్ట్ హారర్ మూవీస్ నుంచి క్రైమ్ కామెడీ, మర్డర్ థ్రిల్లర్స్ వరకూ ఈ వారం ఓటీటీలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న మూవీస్ తాజాగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ లిస్ట్ ఓసారి పరిశీలిస్తే..
హారర్ కామెడీ థ్రిల్లర్ 'శుభం'
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన ఫస్ట్ మూవీ 'శుభం'. హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రవీణ్ కండ్రేగుల ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. హర్షిత్ రెడ్డి, శ్రియ, శ్రీనివాస్ రెడ్డి, శ్రావణి లక్ష్మి, వంశీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. సీరియళ్లకు బానిసలై వింతగా ప్రవర్తిస్తోన్న భార్యల వల్ల భర్తలు ఎలా ఇబ్బంది పడ్డారో ఈ మూవీలో చూపించారు.
నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్స్
బ్లైండ్ స్పాట్ - ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్‌లో అలరించే హీరో నవీన్ చంద్ర నటించిన రెండు క్రైమ్ థ్రిల్లర్స్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేశాయి. నవీన్ చంద్ర, రాశీసింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్లైండ్ స్పాట్'.. శుక్రవారం నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు.
లెవన్ - నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన మరో లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'ఎలెవన్'. ఈ మూవీకి లోకేశ్ అజిల్స్ దర్శకత్వం వహించగా.. రియా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, ఆడుకాలం నరేన్, రవి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
హారర్ కామెడీ 'డీడీ నెక్స్ట్ లెవల్'
సంతానం, గౌతమ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'డీడీ నెక్స్ట్ లెవల్'. ప్రేమ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నెల రిలీజై భయపెడుతూనే నవ్వించింది. తాజాగా.. శుక్రవారం నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్ అవుతోంది.
అక్షయ్ కుమార్ 'కేసరి 2'
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా 'కేసరి 2'. ఏప్రిల్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా.. ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' వేదికగా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించగా.. ఆర్ మాధవన్, అనన్య పాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు.
ఈ మూవీస్ కూడా..
- అమెజాన్ ప్రైమ్ వీడియో - ఎలెవన్, బ్లైండ్ స్పాట్, ఏస్ (తెలుగు, తమిళం), మర్యాదప్రశ్నే (కన్నడ), నాలే రాజా కోలీ మాజా (కన్నడ), ది అమెట్యూర్ (ఇంగ్లీష్), క్లౌన్ ఇన్ ఏ కార్న్ ఫీల్డ్ (ఇంగ్లిష్ - రెంటెడ్), Misericordia (ఇంగ్లీష్ - రెంటెడ్), వెన్ ఫాలిస్ కమింగ్ (ఇంగ్లీష్ - రెంటెడ్).
- ఆహా - ఎలెవన్, కార్తిక: ది మిస్సింగ్ కేస్
- జియో హాట్ స్టార్ - శుభం, కేసరి 2, పడక్కలం (మలయాళం)
- నెట్ ఫ్లిక్స్ - రానా నాయుడు వెబ్ సిరీస్, ట్రైన్ వ్రెక్
- సోనీ లివ్ - అలప్పుజా జింఖానా (మలయాళం)
- జీ5 - డీడీ నెక్స్ట్ లెవల్
- సన్ నెక్స్ట్ - డియర్ ఉమ
- ఈటీవీ విన్ - ఆ ఒక్కటీ అడక్కు