Latest OTT Movies Web Series Streaming On OTT: ఈ దీపావళికి మూవీ లవర్స్‌కు వినోదాల విందు అందనుంది. శుక్రవారం ఒక్క రోజే పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో దాదాపు 21 మూవీస్ స్ట్రీమింగ్ కానుండగా... తెలుగులోనే 6 మూవీస్ ఉన్నాయి. వీటితో పాటే బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు సైతం సందడి చేయనున్నాయి. వీటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్స్‌తో పాటు రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ సైతం ఉన్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'తో పాటు మంచు లక్ష్మి క్రైమ్ థ్రిల్లర్ 'దక్ష' ఓటీటీలోకి వచ్చేశాయి. ఇక వీటితో పాటే లవ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ 'ఆనంద లహరి' కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అలాగేే, లావణ్య త్రిపాఠి థ్రిల్లర్ మూవీ 'టన్నెల్', భాగవతి చాప్టర్ సినిమాలు తెలుగులో అలరించనున్నాయి. పూర్తి లిస్ట్ ఓసారి చూస్తే...
అమెజాన్ ప్రైమ్ వీడియో
- దక్ష: ది డెడ్లీ కాన్సిపిరసీ (తెలుగు మూవీ), టన్నెల్: సన్ ఇన్ ది డార్క్ (తమిళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగు డబ్బింగ్), ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ (అక్టోబర్ 18), హాలీవుడ్ హస్లర్ - గ్లిట్జ్, గ్లామ్, స్కామ్ (డాక్యుమెంటరీ సిరీస్)
'ఆహా' ఓటీటీ
- ఆనందలహరి (తెలుగు వెబ్ సిరీస్ - అక్టోబర్ 17), మథల్ పక్కమ్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్)
'నెట్ ఫ్లిక్స్' ఓటీటీ
- 27 నైట్స్ (స్పానిష్ మూవీ - అక్టోబర్ 17), గుడ్ న్యూస్ (కొరియన్ మూవీ - అక్టోబర్ 17), షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్ (స్పానిష్ మూవీ - అక్టోబర్ 17), గ్రేటర్ కాలేష్ (హిందీ సిరీస్ - అక్టోబర్ 17), ద పర్ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ మూవీ - అక్టోబర్ 17), టర్న్ ఆఫ్ ది సైడ్ (హాలీవుడ్ సిరీస్ సీజన్ 2 - అక్టోబర్ 17), ది డిప్లొమాట్ (సీజన్ 3 - అక్టోబర్ 17), హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ (యానిమేటెడ్ మూవీ - అక్టోబర్ 18)
'జీ5' ఓటీటీ
- కిష్కింధపురి (తెలుగు సినిమా - అక్టోబర్ 17), భగవాన్ చాప్టర్ 1 (హిందీ మూవీ - అక్టోబర్ 17), అభయంతర కుట్టవాళి (మలయాళ మూవీ - అక్టోబర్ 17), మేడమ్ సేన్ గుప్తా (బెంగాళీ మూవీ - అక్టోబర్ 17), ఎలుమలే (కన్నడ మూవీ - అక్టోబర్ 17)
జియో హాట్ స్టార్
- ఘోస్ట్స్ సీజన్ 5 (హాలీవుడ్ వెబ్ సిరీస్ - అక్టోబర్ 17)
'సన్ నెక్స్ట్' ఓటీటీ
- ఇంబమ్ (మలయాళ మూవీ - అక్టోబర్ 17), మట్టా కుతిరై (మలయాళ మూవీ - అక్టోబర్ 19), అందోదిట్టు కాలా (కన్నడ రొమాంటిక్ డ్రామా - అక్టోబర్ 17)
లయన్స్ గేట్ ప్లే
- సంతోష్ (హిందీ మూవీ - అక్టోబర్ 17), వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ - అక్టోబర్ 17).
ఓటీటీతో పాటే థియేటర్లలోనూ 4 కొత్త మూవీస్ సందడి చేస్తున్నాయి. ఈ నెల 16న ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం 'మిత్ర మండలి' ప్రేక్షకుల ముందుకు రాగా... శుక్రవారం ఒక్క రోజే ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్', సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇక కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' మూవీ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది.