Vijay Devarakonda's Kingdom OTT Streaming Update: రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా 'కింగ్‌డమ్‌'. జూలై 31న పాన్ ఇండియా రిలీజ్ అయ్యింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది? ఏ ఓటీటీ వేదికలో అందుబాటులో ఉంది? అనేది తెలుసుకోండి. 

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి వచ్చిన 'కింగ్‌డమ్‌'Kingdom Streaming Netflix: ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ 'కింగ్‌డమ్‌' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఓటీటీలో ఇప్పుడు సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో 'కింగ్‌డమ్‌' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ సబ్‌ టైటిల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. సో లాంగ్వేజ్ అర్థం కాని కొందరు ఏ భాషలో అయినా స్ట్రీమింగ్ చేసుకుని కింద సబ్ టైటిల్స్ చూసుకోవచ్చు.

Also Read: సుందరకాండ రివ్యూ: పెళ్లి కాని యూత్ రిలేటయ్యే సీన్స్, మరి పాయింట్? నారా రోహిత్ సినిమా ఎలా ఉందంటే?

'కింగ్‌డమ్‌' కథ ఏమిటి? హీరో ఏం చేశాడు?అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో మొదలై, తర్వాత కొంత మంది ప్రజలు కోసం కథానాయకుడు ఏ విధమైన పోరాటం చేశాడు? అనే పాయింట్ దగ్గర ఆగిన కథ 'కింగ్‌డమ్‌'.

సూరి (విజయ్ దేవరకొండ) కానిస్టేబుల్. అతని చిన్నతనంలో నాన్న మరణిస్తాడు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయిన అన్నయ్య శివ (సత్యదేవ్) రాక కోసం తల్లి (రోహిణి) కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంది. శివ శ్రీలంకలో ఉన్నాడని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పడంతో అక్కడకు సీక్రెట్ మిషన్ మీద వెళతాడు సూరి. శ్రీలంకలో శివ స్మగ్లర్ ఎలా అయ్యాడు? అక్కడ సెటిలైన తెలుగు జాతి నేపథ్యం ఏమిటి? వాళ్ళను శివ, ఆ తర్వాత సూరి ఎలా కాపాడారు? అనేది సినిమా. థియేటర్లలో సినిమాకు ఆశించిన స్పందన రాలేదు. మిక్స్డ్ టాక్ లభించింది. భారీ కలెక్షన్స్ సైతం రాలేదు. మరి ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. పార్ట్‌ లార్జ్‌ స్కేల్‌లో ఉంటుందని 'కింగ్‌డమ్‌' ఎండింగ్ చూస్తే అర్థం అయ్యింది. అది ఎప్పుడు సెట్స్‌ మీదకు వెళుతుందో చూడాలి.

Also Readఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై నారా రోహిత్ రియాక్షన్ అదేనా? సింపుల్‌గా హర్ట్‌ చేయకుండా చెప్పేశారా?

'కింగ్‌డమ్‌'కు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. 'జెర్సీ' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. అయితే ఆవిడ స్క్రీన్ స్పేస్ తక్కువ. ఇందులో హీరోకు అన్నయ్య పాత్రలో సత్యదేవ్ నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థల మీద సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు.