Kerala Crime Files Series Season 2 Trailer Released: 2023లో రిలీజై ఓటీటీ ఆడియన్స్‌కు మంచి థ్రిల్ పంచిన వెబ్ సిరీస్ 'కేరళ క్రైమ్ ఫైల్స్'. డిస్నీ + హాట్ స్టార్ (జియో హాట్ స్టార్) ఓటీటీ వేదికగా ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు మరో సరికొత్త క్రైమ్ కథాంశంతో 'కేరళ క్రైమ్ పైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు' పేరుతో సీజన్ 2 రూపొందుతోంది. తాజాగా.. ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఆసక్తికరంగా ట్రైలర్
ఈ సిరీస్‌లో అజు వర్గీస్, జిన్జ్ షాన్, లాల్, శ్రీజిత్ మహాదేవన్, నివాస్ వాలిక్కున్ను కీలక పాత్రలో పోషించగా.. అహ్మద్ కబీర్ దర్శకత్వం వహించారు. మరో సరికొత్త క్రైమ్ స్టోరీతో కొత్త సీజన్ రాబోతున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. 'కొత్త ఫైల్ ఓపెన్ అయింది. టీం తిరిగి వచ్చింది.' అంటూ జియో హాట్ స్టార్ సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ రిలీజ్ చేసింది.
'తిరువనంతపురం జిల్లాలో ఐదుగురు ఎస్‌హెచ్‌వోలు, వేర్వేరు స్టేషన్లలో 12 సివిల్ పోలీసులు ఈ రోజు సస్పెన్షన్‌కు గురయ్యారు.' అనే న్యూస్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా హైప్ క్రియేట్ చేసింది. మర్డర్ మిస్టరీ వెనుక ఎవరున్నారో కనిపెట్టడంలో జరిగే పరిణామాలను ఈ సిరీస్‌లో చూపించారు. అసలు ఆ పోలీసులు సస్పెండ్ అయ్యేందుకు కారణాలేంటి?, వారు ఎవరి కోసం వెతుకుతున్నారు?, చివరకు నిందితులు దొరికారా? అనేది తెలియాలంటే సిరీస్ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. 'క్రిమినల్స్ మంచిగా ప్రవర్తించాలని మనం అస్సలు అనుకోకూడదు.' అంటూ ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. దీంతో సరికొత్త క్రైమ్ సిరీస్ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి నెలకొంది. మలయాళం, తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, బెంగాళీ, మరాఠీ భాషల్లో ఈ సిరీస్ త్వరలో అందుబాటులోకి రానుంది.
Also Read: రైల్వే క్లర్క్ కుమారుడు to బాలీవుడ్ ఫేమస్ సింగర్ - తాత బయోపిక్‌లో మనవడు.. ఆ స్టోరీ ఏంటో తెలుసా?
సీజన్ 1 స్టోరీ ఏంటంటే?
లాడ్జిలో జరిగిన ఓ మహిళ హత్య కేసును సింగిల్ క్లూతో పోలీసులు ఛేదించిన తీరును 'కేరళ క్రైమ్ ఫైల్స్' సిరీస్ సీజన్ 1లో ఆసక్తికరంగా చూపించారు. నగరంలోని ఓ లాడ్జిలో నీటి సమస్య తలెత్తగా రిసెప్షనిస్ట్‌గా ఉన్న శరత్ (ఎఆర్ హరిశంకర్).. ఏదైనా రూంలో లీకేజీ ఉందేమోనని చెక్ చేస్తాడు. ఇదే సమయంలో ఓ రూంలో మహిళ డెడ్ బాడీని చూసి షాక్ అవుతాడు. పోలీసులకు సమాచారం అందించగా వారు హత్య కేసుపై విచారణ ప్రారంభిస్తారు. హత్యకు గురైన మహిళ ఓ వేశ్య అని తెలుసుకున్న పోలీసులు.. నిందితుడిని ఎలా పట్టుకున్నారు? అనేదే ఈ సిరీస్‌లో చూపించారు.