Sachin Mani's Demon Movie OTT Release On Aha: క్రైమ్, హారర్ థ్రిల్లర్స్ అంటేనే మూవీ లవర్స్‌కు ఓ స్పెషల్ క్రేజ్. అందుకు అనుగుణంగానే ప్రముఖ ఓటీటీలు అలాంటి కంటెంట్‌నే స్ట్రీమింగ్ చేస్తున్నాయి. తాజాగా.. బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ తెలుగులో అందుబాటులోకి వచ్చింది.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

2023లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ 'డీమన్' (Demon). రమేష్ పళనీవేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఈ క్రమంలో క్రేజ్ దృష్ట్యా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచే ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతుంది. భవానీ మీడియా ద్వారా తెలుగు ఆడియన్స్‌కు ఈ మూవీని అందుబాటులోకి తెచ్చారు.

ఈ మూవీలో సచిన్ మణి, అబర్నతి ప్రధాన పాత్రల్లో నటించగా.. సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రలు పోషించారు. హారర్, సస్పెన్స్, ట్విస్ట్‌లతో కూడిన స్టోరీతో 'డీమన్' ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతోంది. ఈ చిత్రానికి రోనీ రాఫెల్ మ్యూజిక్ అందించారు.  ఆర్.ఎస్. ఆనందకుమార్ విజువల్స్, ఎం.రవికుమార్ ఎడిటింగ్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ వీకెండ్‌లో ఈ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్‌ని 'ఆహా' ఓటీటీలో మిస్ కావొద్దంటూ మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేసింది.

Also Read: తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటన - బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రభాస్ 'కల్కి'.. బెస్ట్ యాక్టర్‌గా బన్నీ

స్టోరీ ఏంటంటే?

2023లో రిలీజ్ అయిన హారర్ థ్రిల్లర్ 'డీమన్' దాదాపు ఏడాదిన్నర తర్వాత తెలుగు ఆడియన్స్‌ను భయపెట్టేందుకు రాబోతోంది. ఇక స్టోరీ విషయానికొస్తే.. విఘ్నేష్ శివన్ (సచిన్) ఓ డైరెక్టర్. ఆడియన్స్‌కు ఓ మంచి హారర్ అందించాలని ఆ ప్రయత్నాల్లో ఉంటాడు. తనకు ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా స్టోరీ రాసుకునేందుకు సిటీ మధ్యలో ఓ బంగ్లాకు మారతాడు. అయితే, ఆ బిల్డింగ్‌లో నిద్రపోయిన శివన్‌కు విచిత్రమైన కలలు వస్తుంటాయి. అసలు ఆ బిల్డింగ్‌లో ఏం జరుగుతుంది. నిజంగానే అందులో దెయ్యం ఉందా?, అసలు హారర్ స్టోరీని తీశాడా?, తన డైరెక్టర్ కల నెరవేరిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.