KD The Devil OTT Platform Release Date: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మేనల్లుడు, కన్నడ స్టార్ ధృవ్ సర్జా హీరోగా నటించిన పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ 'కేడీ: ది డెవిల్'. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. థియేటర్లలో ఏప్రిల్ 30న విడుదలైంది. అంతకు ముందు సినిమా హిందీ వెర్షన్ సాంగ్ 'సర్కే చునార్' కాంట్రవర్సీకి కారణమైంది. 'లిరిక్స్‌లో బూతులేంటి?' అని సాహిత్యంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. 'కేడీ ది డెవిల్' ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? ఎప్పట్నించి అవుతుంది? వంటి వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

'జీ5' ఓటీటీలో 'కేడీ ది డెవిల్'...జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్KD The Devil Streaming On Zee5: 'కేడీ: ది డెవిల్' స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'జీ5' సొంతం చేసుకుంది. జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం వెల్లడించింది.

కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 'కేడీ ది డెవిల్' స్ట్రీమింగ్ కానుంది. విమర్శల కారణం థియేటర్లలో సినిమాకు సరైన స్పందన రాలేదు. మరి ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

Continues below advertisement

Also Read: Sara Khan Controversial Post On EID - బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్

అసలు 'కేడీ ది డెవిల్' కథ ఏమిటి?'కేడీ ది డెవిల్' కథ బెంగళూరు నేపథ్యంలో 1970ల కాలం సాగుతుంది. కలి దాస (KD) చదువుకోలేదు. కానీ, తన కుటుంబం అంటే అతనికి అంతులేని ప్రేమ, విధేయత. అన్న ధర్మ చేతిలో ఎప్పుడూ తిట్లు తింటూ ఉంటాడు. డాన్ ధక్ దేవా (సంజయ్ దత్) అంటే అతనికి ఆరాధ భావన. అందరూ భయపడే డాన్‌ను దైవంగా భావిస్తుంటాడు. అయితే... మచ్చు లక్ష్మితో ప్రేమలో పడిన తర్వాత కేడీ జీవితం అనూహ్య మలుపులు తిరుగుతుంది. తాను దైవంగా భావించే ధక్ దేవా వల్ల తన కుటుంబానికి ప్రమాదం ఉందని, ధక్ దేవా అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడని కేడీ తెలుసుకుంటాడు. ఆ తర్వాత దేవాపై యుద్ధం ప్రకటించి ఎలా డెవిల్ అయ్యాడు? అనేది కథ. 

Also ReadKattalan Review Telugu - 'కాటాలన్' రివ్యూ: పుష్ప లాంటి కథ... ఏనుగు దంతాల స్మగ్లింగ్... మలయాళీ యాక్షన్ ఫిల్మ్ హిట్టా? ఫట్టా?

రక్షిత భర్త దర్శకత్వంలో 'కేడీ''కేడీ ది డెవిల్' సినిమాకు హీరోయిన్ రక్షిత భర్త ప్రేమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శిల్పా శెట్టి కుంద్రా, వి. రవిచంద్రన్, రమేష్ అరవింద్, రీష్మా నానయ్య ప్రధాన తారాగణం. ఇందులో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ నోరా ఫతేహి అతిథి పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రానికి అర్జున్ జన్యా సంగీతం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ప్రొడ్యూస్ చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.

Also ReadBlast Zone Review Telugu - 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?