Jaya Surya's Meri Awas Suno OTT Streaming After Four Years : రియల్ లైఫ్ స్టోరీ... ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ... నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది. అప్పట్లో మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ మూవీ గురువారం నుంచి డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది.
ఏ మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మలయాళ స్టార్ జయసూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పేరు 'మేరీ ఆవాజ్ సునో'. 2022లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ స్టోరీ ఓ ఇన్‌స్పిరేషనల్ అని మేకర్స్ తెలిపారు. ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్'లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 'ఆశ, అంతర్గత బలంతో కూడిన ఎమోషనల్ జర్నీ' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు ప్రజేష్ సేన్ దర్శకత్వం వహించగా... జయసూర్యతో పాటు మంజు వారియర్, శివద, ఆర్ మాధవన్, సుధీర్ కరమణ, జానీ ఆంటోని, గౌతమి నాయర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. బి. రాకేష్ మూవీని నిర్మించగా... ఎం.జయచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను సూపర్ హిట్ బెంగాళీ మూవీ 'కంటో' ఆధారంగా రూపొందించారు.
స్టోరీ ఏంటంటే?
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే... గొంతు క్యాన్సర్‌తో పోరాడే ఓ ఫేమస్ రేడియో జాకీ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఓ ఎమోషనల్ మ్యూజికల్ డ్రామా. శంకర్ (జయసూర్య) ఓ పాపులర్ రేడియో జాకీగా (ఆర్జే) వర్క్ చేస్తుంటాడు. తన వాయిస్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటాడు. తన మాటలతో ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గానే నిలుస్తూ... ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతుంటాడు. తన గొంతే అతని ప్రపంచం.
అంతా సాఫీగా జరిగిపోతుంది అనుకునే తరుణంలో శంకర్‌కు గొంతు క్యాన్సర్ అని తేలుతుంది. తన వాయిస్ శాశ్వతంగా పోతుందని తెలిశాక ఒక్కసారిగా జీవితం తలకిందులు అవుతుంది. రేడియో జాకీగా తన కెరీర్ ముగిసిపోయిందనుకుని డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు శంకర్. సరిగ్గా అదే టైంలో అతని జీవితంలోకి డాక్టర్ రేష్మి (మంజు వారియర్) అడుగు పెడుతుంది. స్పీచ్ థెరపిస్ట్ అయిన ఆమె శంకర్ తన కొత్త జీవితం ప్రారంభించేలా చేస్తుంది. తనను తాను అంగీకరించేలా చేస్తుంది. మళ్లీ శంకర్ ఎలా ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Peddi Release : రామ్ చరణ్ పెద్దికి పెద్ద భరోసా - జన నాయగన్ లాంటి పరిస్థితి రాకుండా...
