Kajal Aggarwal Is Starring An Upcoming Telugu Dark Thriller Web Series Titled As Vishakha : స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు టాలీవుడ్‌లో ప్రస్తుతం కాస్త గ్యాప్ వచ్చింది. గతంలో స్టార్ హీరోల సరసన నటించిన ఆమెకు ప్రజెంట్ అవకాశాలు తగ్గాయి. లాస్ట్‌గా విష్ణు మంచు 'కన్నప్ప'లో పార్వతీ దేవిగా కనిపించారు. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నా అవి లీడ్ రోల్స్ కాదు. తాజాగా ఆమె ఓటీటీలో రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. 

Continues below advertisement

థ్రిల్లర్ సిరీస్‌ 'విశాఖ'

బాలీవుడ్ పాపులర్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ 'ఆర్య'. సుస్మితా సేన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ ఇప్పటివరకూ 3 సీజన్లు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దీన్ని తెలుగులో 'విశాఖ'గా రీమేక్ చేయబోతున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' 'సౌత్ బౌండ్' పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సిరీస్‌లో కాజల్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. 

Continues below advertisement

ఒరిజినల్ సిరీస్‌లో ప్రధాన పాత్రకు ముగ్గురు పిల్లలు ఉంటారు. మరి ఈ రీమేక్‌లోనూ అలానే చూపిస్తారా? లేదా ఏవైనా మార్పులు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. 'విశాఖ'లో తీవ్ర ఎమోషన్, మానసిక బలం ఎక్కువగా ఉన్న ఓ తల్లిగా ఆమె కనిపించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. పిల్లల రక్షణ కోసం ఆ తల్లి ఏం చేసింది... నేర ప్రపంచం మధ్య తన పిల్లలను ఎలా కాపాడుకుంది? అనేదే సిరీస్ స్టోరీ అని తెలుస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో తన నటనతో ప్రత్యేకత సాధించిన కాజల్... తనదైన పవర్ ఫుల్ యాక్టింగ్, తన స్టైల్‌తో ఆకట్టుకుంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : దొరికిన పర్స్‌తో మర్డర్ మిస్టరీ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న మమ్ముట్టి కామెడీ థ్రిల్లర్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వర్క్ మాత్రమే కాదు... ఇల్లు ఇచ్చింది

సౌత్ ఇండస్ట్రీ తనకు పని మాత్రమే కాదు ఇల్లు ఇచ్చిందని కాజల్ తెలిపారు. ఈవెంట్‌కు డైరెక్ట్‌గా హాజరు కాలేకపోయినా... స్పెషల్‌గా ఓ నోట్ పంపారు. 'సౌత్ ఇండస్ట్రీ నాకు పని మాత్రమే కాదు ఇల్లు కూడా ఇచ్చింది. ఇక్కడి కథల్లో ఎప్పటికీ మారనిది అవి చెప్పే ఎమోషన్, నిజాయతీ, కథలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రతిభను సృజనాత్మకతను గౌరవించే వేదికగా జియో హాట్ స్టార్ ముందుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.' అని తెలిపారు. ఇక ఇదే ఈవెంట్‌లో 'జియో హాట్ స్టార్' తమ ప్లాట్ ఫాంలో కొత్తగా రాబోయే ఒరిజినల్ లైనప్స్ కూడా రిలీజ్ చేసింది.

రాబోయే సరికొత్త వెబ్ సిరీస్‌లు

  • మూడు లాంతర్లు (ఫిక్షనల్ సిరీస్) - ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సిరీస్‌లో బలమైన మహిళా పాత్రలను ప్రధానంగా చూపించే ఎమోషనల్ స్టోరీ.
  • విక్రమ్ ఆన్ డ్యూటీ (ఫిక్షన్) - నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే స్టోరీ.
  • వరం (ఫిక్షన్) - విశ్వదేవ్ రాచకొండ, శివాత్మిక రాజశేఖర్, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా... లవ్, ఎమోషన్‌తో కూడిన రిలేషన్ షిప్ డ్రామా.
  • బ్యాచ్‌మేట్స్ (ఫిక్షన్) - కాలేజ్‌ రోజులను, స్నేహాలను గతం వదల్లేని నీడలను మళ్లీ తలపించే నాస్టాల్జిక్ డ్రామా.
  • సేవ్ ది టైగర్ (సీజన్ 3) - చైతన్య కృష్ణ, ప్రియదర్శి, అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా... కామెడీ, రిలేషన్, లైఫ్ స్టైల్ మధ్య నడిచే డ్రామా
  • మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ (నాన్ - ఫిక్షన్) - రాధా నాయర్, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా... వింతైన, ఊహించని సంబంధాలు, జంటల కథలను వెదుక్కుంటూ వెళ్లే వినోదాత్మక రియాలిటీ షో.