Mammotty's Dominic And The Ladies Purse OTT Release Date Locked : మలయాళ స్టార్ మమ్ముట్టి లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలో రిలీజ్ అయిన దాదాపు 11 నెలల తర్వాత స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 11 నెలల తర్వాత ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ 'Zee5'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మూవీని మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై మమ్ముట్టినే స్వయంగా నిర్మించారు. ఆయనతో పాటు సుస్మితా భట్, మీనాక్షి ఉన్నికృష్ణన్, గౌతమ్ మీనన్, షైన్ టామ్ చాకో, లీనా, గోకుల్ సురేష్, వినీత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read : లేడీ ఓరియెంటెడ్ మూవీలో భాగ్యశ్రీ - రాజేంద్ర ప్రసాద్ మూవీ ఫేమస్ సాంగ్ లిరిక్ టైటిల్‌గా...
స్టోరీ ఏంటంటే?
దొరికిన లేడీస్ పర్స్ ఆధారంగా ఓ యువతి హత్య కేసును ఎలా ఛేదించారనేదే ఈ మూవీ స్టోరీ. మాజీ పోలీస్ ఆఫీసర్ డొమినిక్‌గా మమ్ముట్టి కనిపించగా... అతని అసిస్టెంట్ విక్కీగా గోకుల్ సురేశ్ నటించారు. ప్రైవేట్ డిటెక్టివ్‌గా మారిన మాజీ పోలీస్ ఆఫీసర్ డొమినిక్ (మమ్ముట్టి)కు ఓ లేడీస్ పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్ ఎవరిది అని కనిపెట్టే క్రమంలో పూజ అనే యువతి మిస్సింగ్ బయటపడుతుంది. అసలు పూజ ఎవరు? పర్స్‌కు ఆ యువతికి ఉన్న సంబంధం ఏంటి? ఆమెను ఎవరు హత్య చేశారు? ఆమె బాయ్ ఫ్రెండ్ కార్తిక్ ఏమయ్యాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.