Dulquer Salmaan Kaantha OTT Streaming : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ రీసెంట్ పీరియాడికల్ డ్రామా 'కాంత' ఫైనల్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

Continues below advertisement

5 భాషల్లో స్ట్రీమింగ్

ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో గురువారం అర్ధరాత్రి నుంచి 'కాంత' స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సెల్వమణి సెల్వరాజ్ మూవీకి దర్శకత్వం వహించగా... భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు రానా దగ్గుబాటి, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా, దుల్కర్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు.

Continues below advertisement

Also Read : బాలయ్య 'అఖండ 2' సెలబ్రేషన్స్ - థియేటర్ల వద్ద ఫ్యాన్స్ తాండవం... వీడియోలు వైరల్

స్టోరీ ఏంటంటే?

ఫేమస్ డైరెక్టర్ అయ్య (సముద్రఖని) తన తల్లి జీవిత కథ ఆధారంగా 'శాంత' టైటిల్‌తో మూవీ తీయాలనుకుంటాడు. తన ప్రియ శిష్యుడు మహాదేవన్ (దుల్కర్ సల్మాన్)ను హీరోగా ఎంచుకుంటాడు. ప్రేక్షకులు మహాదేవన్‌ను తమ అభిమాన హీరోగా కొలుస్తూ... 'నట చక్రవర్తి' బిరుదు ఇస్తారు. అయితే, ఊహించని విధంగా అయ్యకు, మహాదేవన్‌కు మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేన్న భగ్గుమనే నేపథ్యంలో 'శాంత' షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుంది.

కొన్నేళ్ల తర్వాత సినిమా తాను చెప్పిన క్లైమాక్స్ తీయాలనే కండిషన్‌తో చేయడానికి ఒప్పుకొంటాడు మహాదేవన్. టైటిల్ కూడా 'కాంత'గా మార్చేస్తాడు. ఇది తనకు నచ్చకపోయినా ఎన్ని మార్పులు చేసినా తన తల్లి స్టోరీని సిల్వర్ స్క్రీన్‌పై చూడాలనే కోరికతో అయ్య ఒప్పుకొంటాడు. సెట్‌లో మాత్రం ఇద్దరి మధ్య మాటలు లేకుండానే షూటింగ్ సాగిపోతుంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే) ప్రయత్నిస్తుంటుంది. ఇక మూవీ పూర్తైపోతుందనుకునే టైంలో టీంలో ఒకరు మర్డర్ అవుతారు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ రగడ స్టార్ట్ అవుతుంది. ఆ హత్య కేసును విచారించేందుకు ఇన్‌స్పెక్టర్ దేవరాజ్ (రానా) రంగంలోకి దిగుతాడు. అసలు ఆ హత్య చేసింది ఎవరు? ప్రాణానికి ప్రాణంగా ఉండే గురుశిష్యుల మధ్య వివాదం ఎందుకు వచ్చింది? కాంత మూవీ రిలీజ్ అయ్యిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.