Darling Krishna's Brat Movie OTT Streaming : మరో కన్నడ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వారికి ఈ మూవీ ఓ స్పెషల్ అనే చెప్పాలి. కొన్ని రోజుల క్రితం కన్నడ ఒరిజినల్ వెర్షన్ స్ట్రీమింగ్ కాగా ఇప్పుడు తమిళ, తెలుగు వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఆ మూవీనే కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'బ్రాట్'.

Continues below advertisement

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'బ్రాట్' మూవీ సడన్‌గా ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ అందుబాటులోకి వచ్చింది. డార్లింగ్ కృష్ణ, మనీషా కంద్కూర్ ప్రధాన పాత్రల్లో నటించగా... అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిర, డ్రాగన్ మంజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి శశాంక్ దర్శకత్వం వహించగా... డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మంజునాథ్ వి.కంద్కూర్ నిర్మించారు. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Continues below advertisement

Also Read : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్

కథేంటంటే?

క్రిస్టీ (డార్లింగ్ కృష్ణ) ఆకతాయిగా ఫ్రెండ్స్‌తో తిరుగుతుంటాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలని కలలు కంటూ క్రికెట్ బెట్టింగ్స్‌కు పాల్పడుతూ ఉంటాడు. అయితే, క్రిస్టీ తండ్రి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కొడుకు బెట్టింగులకు పాల్పడుతున్నాడని తెలుసుకున్న తండ్రి ఏం చేశాడు? క్రిస్టీ బెట్టింగ్స్ వల్ల అతనితో పాటు అతని ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఫైనల్‌గా ఏమైంది అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.