Allari Naresh's 12A Railway Colony OTT Streaming : అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ'. గత నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. తాజాగా ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీకి మా 'ఊరి పొలిమేర', 'పొలిమేర 2' మూవీస్ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు అందించగా... నాని కాసరగడ్డ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
నరేష్, కామాక్షి భాస్కర్లతో పాటు డైలాగ్ కింగ్ సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, మధుమణి, గగన్ విహారి, అనీష్ కురువిల్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి మూవీని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.
Also Read : అఖండ 2 రిలీజ్ టీజర్... త్రిశూలం పట్టిన శివునిలా బాలయ్య - దిష్టి తీసే షాట్ సూపరంతే
స్టోరీ ఏంటంటే?
వరంగల్‌లోని రైల్వే కాలనీలో కార్తీక్ (అల్లరి నరేష్) తన ఫ్రెండ్స్‌తో కలిసి జీవిస్తుంటాడు. అనాథగా పెరిగిన కార్తిక్‌కు అతని ఫ్రెండ్సే జీవితం. లోకల్ పొలిటీషియన్ టిల్లు (జీవన్ కుమార్)కు నమ్మిన బంటు. గత 2 ఎన్నికల్లో ఓడిన టిల్లు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నిస్తుంటాడు. దీని కోసం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కార్తిక్‌కు అప్పగిస్తాడు. ఇందులో భాగంగా యూత్‌ను అట్రాక్ట్ చేసేందుకు కార్తిక్ తన కాలనీలో యువతీ యువకులకు ఆటల పోటీ నిర్వహిస్తుంటాడు.
తన పక్కింట్లో ఉండే ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను తొలిచూపులోనే చూసి కార్తీక్ ఇష్టపడతాడు. పైకి అతన్ని అసహ్యించుకుంటున్నా లోపల మాత్రం కార్తిక్‌ను ఇష్టపడుతుంది ఆరాధన. ఓ రోజు ఓ ఇంపార్టెంట్ పార్శిల్ కార్తిక్‌కు ఇచ్చి దాచిపెట్టమంటాడు టిల్లు. అది ఓపెన్ చెయ్యొద్దని హెచ్చరిస్తాడు. అయితే, పోలీసులు తన ఇంటిపై రైడ్‌కు వస్తున్నారని తెలుసుకున్న కార్తిక్ ఆ పార్శిల్‌ను పక్కింట్లో ఉండే ఆరాధన ఇంట్లో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. దొంగతనంగా వారి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆరాధన చూసి తనను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాలని అంటుంది. అయితే, పై గదిలో ఏదో చప్పుడు కావడంతో వెళ్లిన కార్తిక్... ఆరాధన, ఆమె తల్లి చనిపోయి ఉండడం చూసి షాక్ అవుతాడు. అసలు ఆరాధన ఫ్యామిలీని చంపింది ఎవరు? టిల్లు తాను ఎమ్మెల్యే అయ్యేందుకు ఏం ప్లాన్ చేశాడు? తనపై పడ్డ హత్యా నేరం నుంచి కార్తిక్ ఎలా బయటపడ్డాడు? ఆరాధన తన భార్య అంటూ బయటకు వచ్చిన ప్రముఖ డాక్టర్ జయదేవ్ కురువిల్లాకు ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? దీని వెనుక మిస్టరీ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.