రాజశేఖర్ కుమార్తెగా శివాత్మిక తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అయితే కథానాయికగా ఆవిడ పరిచయమైన సినిమా 'దొరసాని'. ఆ తర్వాత తెలుగులో 'పంచ తంత్రం', 'రంగ మార్తాండ' సినిమాలు చేశారు. అయితే... తెలుగుతో పాటు ఆమెకు తమిళంలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. శివాత్మిక నటించిన తాజా తమిళ్ సినిమా 'అరోమలే'. ఈ వారం ఓటీటీలోకి రానుంది.
డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో 'అరోమలే'...తెలుగులోనూ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్!Aaromaley OTT Streaming Platform and Release Date: రొమాంటిక్ కామెడీగా 'అరోమలే'ను తెరకెక్కించారు. నవంబర్ 7న తమిళనాడులో థియేటర్లలో విడుదల అయ్యింది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది జియో హాట్ స్టార్ ఓటీటీ.
'అరోమలే' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ ఓటీటీ సొంతం చేసుకుంది. తమిళంతో పాటు మిగతా మూడు దక్షిణాది భాషలు తెలుగు, కన్నడ, మలయాళం - అలాగే హిందీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి... అంటే ఈ శుక్రవారం నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Also Read: Akhanda 2 Latest News: అఖండ 2 వచ్చింది... డిసెంబర్ 12 నుంచి ఎన్ని సినిమాలు వెనక్కి? ఎన్ని బరిలోకి?
'అరోమలే' సినిమాలో కిషేన్ దాస్ హీరో. ఆయనకు జంటగా శివాత్మిక రాజశేఖర్ నటించారు. ఈ సినిమాలో వీటీవీ గణేష్, హర్షద్ ఖాన్, శిబి జయకుమార్, తులసి తదితరులు నటించారు. ఈ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.