Kiran Abbavaram's K RAMP OTT Platform Locked: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ లవ్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'కే ర్యాంప్' శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆసక్తిని పెంచేయగా ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్లుగానే ఎంటర్టైన్మెంట్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ సైతం ఫిక్స్ అయ్యింది.

Continues below advertisement


ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్


'కే ర్యాంప్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'ఆహా' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ రిజల్ట్‌ మేరకు 4 నుంచి 6 వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. సినిమాలో 'రిచ్చెస్ట్ చిల్లర్ గాయ్' కుమార్‌గా కిరణ్ సందడి చేశారు. ఈ మూవీతోనే జైన్స్ నాని డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. కిరణ్ సరసన చెన్నై బ్యూటీ యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించారు.


Also Read: కింగ్ నాగార్జునకు జోడీగా స్వీటీ? - హిట్ పెయిర్ మరోసారి రిపీట్... రోల్ ఏంటో తెలుసా?


కిరణ్, యుక్తి తరేజాలతో పాటు సీనియర్ హీరోస్ నరేష్, సాయి కుమార్, కమెడియన్ వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, 'అమృతం' సీరియల్ ఫేం నారిపెద్ది శివన్నారాయణ, అలీ కీలక పాత్రలు పోషించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించగా... చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.