Manav Kaul's Baramulla OTT Release On Netflix: హారర్, క్రైమ్, సూపర్ నేచురల్ థ్రిల్లర్ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్ నడుస్తోన్న క్రమంలో నేరుగా ఓటీటీల్లోకే మూవీస్ రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలోకి రానుంది.
ఆ రోజు నుంచి స్ట్రీమింగ్
మానవ్ కౌల్, భాషా సుంబ్లి ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ నేచరల్ మిస్టరీ థ్రిల్లర్ 'బారాముల్లా' నేరుగా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో ఎక్స్‌క్లూజివ్‌గా నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'సత్యం ఒక పురాణం. పురాణాల్లో నిజం ఉన్న ఈ పట్టణానికి స్వాగతం.' అని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి ఆదిత్య సుహాస్ జంబలే దర్శకత్వం వహించగా... బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య, లోకేశ్ ధార్‌తో కలిసి జ్యోతి దేశ్ పాండే నిర్మించారు.
Also Read: అదరగొట్టావ్ 'డ్యూడ్' ప్రదీప్ రంగనాథన్... ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
కశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. బారాముల్లా లోయ ప్రాంతానికి చెందిన డీఎస్పీ రిద్వాన్ సయ్యద్ స్టోరీ ఇది. ఆయన ఈ ప్రాంతానికి బదిలీపై వచ్చిన వెంటనే ఓ యువకుడు మిస్ అవుతాడు? దీని వెనుక ఎవరున్నారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మానవ్ కౌల్, భాషా సుంబ్లీతో పాటు అరిష్టా మెహతా, మిర్ సర్వార్, షాహిద్ లతీఫ్ కీలక పాత్రలు పోషించారు.