Bramarambika Tutika's Anandalahari Series OTT Streaming On Aha: ఈ దీపావళికి మరో లవ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. అందమైన గోదావరి... పల్లెటూరిలో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథ 'ఆనందలహరి' శుక్రవారం నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది.
గోదారోళ్ల లవ్ స్టోరీ
ఈస్ట్ గోదావరి అబ్బాయి, వెస్ట్ గోదావరి అమ్మాయి మధ్య నడిచే పెళ్లి, లవ్ సీన్లతో సాగే 'ఆనందలహరి' వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 'ఈ సిరీస్‌లో ప్రతీ ఎమోషన్ ఓ గోదావరిలా ప్రవహిస్తుంది.' అంటూ సదరు ఓటీటీ సంస్థ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. సిరీస్‌లో అభిషేక్ బొడ్డేపల్లి హీరోగా నటించగా... 'పెళ్లి చూపులు', 'వింధ్యా విహారి' వెబ్ సిరీస్ ఫేం బ్రమరాంబికా తూటికా హీరోయిన్‌గా నటించారు. సాయి వనపల్లి దర్శకత్వం వహించగా... సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రవీణ్ ధర్మపురి నిర్మించారు.
Also Read: 16 నెలల ప్రెగ్నెన్సీ... వరల్డ్ రికార్డు - రూమర్స్‌పై బాలీవుడ్ హీరోయిన్ సెటైరికల్ రియాక్షన్
స్టోరీ ఏంటంటే?
ఈస్ట్ గోదావరి అబ్బాయి ఆనంద్, వెస్ట్ గోదావరి అమ్మాయి లహరిల పెళ్లి, వారి మధ్య జరిగే లవ్ సీన్లతో పాటే ఎమోషన్స్ అన్నీ కలిపి ఓ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా సిరీస్ రూపొందించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అలకలు, యాక్టివ్‌గా ఉండే అబ్బాయి, అతనికి దూరంగా ఉండే అమ్మాయి. దీంతో వారి మధ్య జరిగే గొడవలు, ఆ తర్వాత ప్రేమలో పడడం, చిన్న చిన్న గొడవలతో కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, ఆ తర్వాత వీరి కథ ఏమైంది? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.