Thalapathy Vijay's Jana Nayagan OTT Deal Locked : కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ హీరోగా వస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'జన నాయగన్'. ఆయన కెరీర్‌లో ఇది 69వ సినిమా కాగా... ఈ మూవీ తర్వాత విజయ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్, సాంగ్ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా మూవీ ఓటీటీ డీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Continues below advertisement


ఆ ఓటీటీలో స్ట్రీమింగ్... బిగ్ డీల్


ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కానుండగా... థియేట్రికల్ రన్ తర్వాత 4 నుంచి 6 వారాల మధ్యలో ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


విజయ్ లాస్ట్ మూవీ క్రేజ్ మామూలుగా లేదు. అందుకు తగ్గట్లుగానే డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఆయన సినీ ప్రస్థానంతో పాటు పొలిటికల్ టచ్ ఉండడంతో దాదాపు రూ.110 కోట్ల భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.


Also Read : విలన్ 'కుంభ' ఓకే... నెక్స్ట్ ప్రియాంక చోప్రా - 'SSMB29' నుంచి మరో సర్‌ప్రైజ్ ఎప్పుడంటే?


ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా... విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, మమితా బైజు, బాబీ డియోల్, ప్రియమణి, నరైన్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా... కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 9న మూవీ రిలీజ్ కానుంది. రీసెంట్‌గా మూవీ నుంచి 'కచేరీ' సాంగ్ రిలీజ్ చేయగా ట్రెండ్ అవుతోంది.