Tovino Thomas and Trisha starrer Identity ott release date and platform details: సౌత్ క్వీన్ త్రిషకు మాతృభాష తమిళంతో పాటు తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఒక్క కారణం వల్లే... త్రిష నటించిన తాజా మలయాళ సినిమా 'ఐడెంటిటీ'ని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. థియేటర్లలో విడుదలైన రోజే ప్రేక్షకులకు పెద్ద షాక్ తగిలింది. త్వరలో ఓటీటీలోకి సినిమా వస్తుందని తెలిసింది.
జీ5 ఓటీటీలో త్రిష 'ఐడెంటిటీ' విడుదల
మలయాళంలో వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ హీరో టోవినో థామస్. 'మిన్నల్ మురళి' సినిమా ఓటీటీలో పాపులర్ కావడంతో పాటు ఆయన సూపర్ హిట్ మలయాళ సినిమాలను ఆహా ఓటీటీ తెలుగులో అనువదించడం వల్ల ఏపీ, తెలంగాణ ప్రేక్షకులకు ఆయన తెలుసు. కేరళ వరదల నేపథ్యంలో రూపొందిన '2018' తెలుగులోనూ విజయం సాధించింది.
టోవినో థామస్ హీరోగా నటించిన లేటెస్ట్ మలయాళ సినిమా 'ఐడెంటిటీ'. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఇందులో త్రిష హీరోయిన్. 'వాన' ఫేమ్ వినయ్ రాయ్ కీలక పాత్ర చేశారు. ఇటీవల విలన్ రోల్స్ ఎక్కువ చేస్తున్న ఆయనకు ఇదొక డిఫరెంట్ విలనీ రోల్. మలయాళంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ భారీ కలెక్షన్లు సాధించింది. 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. దాంతో ఈ సినిమాను తెలుగులో జనవరి 24వ తేదీన విడుదల చేశారు. అదే రోజు జీ5 ఓటీటీ వేదిక అతి త్వరలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంది.
మలయాళంలో మాత్రమే కాదు... తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జనవరి 31వ తేదీ నుంచి 'ఐడెంటిటీ'ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 అనౌన్స్ చేసింది.
తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో విడుదలైన వారానికే ఓటీటీ సినిమా వస్తుండడం గమనార్హం. మరి, ఈ విషయం తెలిసిన తెలుగు ప్రేక్షకులు సినిమా చూడడానికి థియేటర్లకు వెళతారో? లేదో? వారానికి ఓటీటీలో వచ్చే సినిమా చూసేందుకు వంద రూపాయలు అయినా సరే ఖర్చు చేస్తారంటారా? వెయిట్ అండ్ సి.