Friday OTT Movies : ప్రతి వారం ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు అడుగు పెడుతుంటాయి. అందులో కొన్ని థియేట్రికల్ రన్ ముగిశాక ఓటీటీ ఎంట్రీ ఇచ్చేవి ఉంటే, మరికొన్ని మాత్రం డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతాయి. ఇక ప్రతి శుక్రవారం థియేటర్లలో సినిమాల పండుగ ఎలా ఉంటుందో, ఓటీటీలో కూడా అదే రేంజ్ లో సందడి ఉంటుంది. ఈరోజు అంటే జనవరి 24న ఏకంగా ఓటీటీలోకి ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో కామెడీ, ఫ్యామిలీ, సర్వైవల్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వంటి అన్నీ జానర్ల సినిమాలు ఉండడం విశేషం.
రజాకార్ - తెలుగు హిస్టారికల్ యాక్షన్ డ్రామా - ఆహా ది స్మైల్ మాన్ -తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ -ఆహాచివరాపల్లి - తెలుగు కామెడీ వెబ్ సిరీస్ - అమెజాన్ ప్రైమ్ వీడియో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ - తెలుగు కామెడీ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ - ఈటీవీ విన్ హిసాబ్ బరాబర్ - హిందీ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ - జీ 5 స్వీట్ డ్రీమ్స్ - రొమాంటిక్ హిందీ మూవీ - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాఫర్ చెఫ్ సీజన్ 2 - కుకింగ్ రియాలిటీ షో హిందీ - జియో సినిమా దీది- అమెరికన్ కామెడీ డ్రామా - జియో సినిమా ది గర్ల్ విత్ ది నీడిల్ - డానిష్ క్రైమ్ మూవీ - ముబి ఓటీటీ బరోజ్ - మలయాళ మూవీ (మల్టీ లాంగ్వేజ్) - హాట్ స్టార్ తిరుమాణిగం - తమిళ మూవీ - జీ 5 వైఫ్ ఆఫ్ - తెలుగు మూవీ - ఈటీవీ విన్ 90 మినిట్స్ - తమిళం - మనోరమా మ్యాక్స్ ది స్టోరీ టెల్లర్ - జియో సినిమా ప్రైమ్ టార్గెట్ - యాపిల్ టీవీ ప్లస్ నైట్ ఏజెంట్ సీజన్ 2 - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్ది హంటింగ్ పార్టీ సీజన్ 1 - ఇంగ్లీష్ - జియో సినిమా ది శాండ్ క్యాజిల్ - అరబిక్ - నెట్ ఫ్లిక్స్
తెలుగు ఆడియన్స్ కు ఇవే స్పెషల్...
ఒక్కరోజే ఓటీటీలోకి ఇన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చినప్పటికీ, అందులో కేవలం కొన్ని మాత్రమే తెలుగు ఆడియన్స్ కి స్పెషల్ కాబోతున్నాయి. ఈ లిస్టులో తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. అందులో అనసూయ లీడ్ రోల్ పోషించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'రజాకార్', వెన్నెల కిషోర్ తెలుగు కామెడీ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ డ్రామా 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్', 'ది స్మైల్ మాన్' తమిళ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్, శివరాపల్లి అనే తెలుగు కామెడీ వెబ్ సిరీస్ ఉన్నాయి. అలాగే 'హిసాబ్ బరాబర్' అనే వెబ్ సిరీస్, 'డి శాండ్ క్యాజిల్, స్వీట్ డ్రీమ్స్ అనేవి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి.
ఈవారం థియేటర్లలోకి 6 సినిమాలు
ఏ శుక్రవారం థియేటర్లలోకి ఏకంగా 6 సినిమాలు వచ్చాయి. సుకుమార్ కూతురు సుకృతి కథానాయికగా నటిస్తున్న 'గాంధీ తాత చెట్టు', టోవినో థామస్, త్రిష మలయాళంలో ఘన విజయం సాధించిన 'ఐడెంటిటీ' తెలుగు వెర్షన్, ప్రేమలు ఫేమ్ మమిత బైజు మలయాళ చిత్రం 'డియర్ కృష్ణ' తెలుగు వెర్షన్, 'తల్లి మనసు' అనే చిన్న సినిమా, హాంకాంగ్ వారియర్స్, హిందీ సినిమా 'స్కై ఫోర్స్' ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.