Sapta Sagaralu Dhaati Side B OTT Release: ‘కేజీఎఫ్’ అనే పాన్ ఇండియా చిత్రం ద్వారా కన్నడ సినిమాలకు తెలుగులో ఆదరణ పెరిగింది. ఆ తర్వాత వచ్చిన మరెన్నో సినిమాలు శాండిల్‌వుడ్ వైపు టాలీవుడ్ ప్రేక్షకులు తిరిగి చూసేలా చేసింది. 2023లో విడుదలయిన అన్ని సినిమాల్లో ‘సప్తా సాగరదాచె ఎల్లో’ అనే కన్నడ చిత్రం.. ఫీల్ గుడ్ సినిమాలు తెరకెక్కించడంలో కూడా శాండిల్‌వుడ్ బెస్ట్ అని నిరూపించింది. ముందుగా కేవలం కన్నడలోనే విడుదలయిన ఈ మూవీకి తెలుగు నుండి ఆదరణ లభించడంతో.. దీనిని తెలుగులో కూడా విడుదల చేశారు. ఫస్ట్ పార్ట్‌లాగానే సీక్వెల్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఫైనల్‌గా ఈ మూవీ సీక్వెల్ ఓటీటీలో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పాడు హీరో రక్షిత్ శెట్టి.
తెలుగులో కూడా సూపర్ హిట్..
‘సప్తా సాగరదాచె ఎల్లో’ మూవీని ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్‌తో తెలుగులో డబ్ చేశారు మేకర్స్. ముందుగా ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఏ’ మూవీ థియేటర్లలో విడుదలయ్యి సూపర్ హిట్‌ను సాధించింది. సినిమా చూసిన వారందరినీ ఎమోషనల్ చేసింది. హేమంత్ ఎమ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రక్షిత్ శెట్టికి జోడీగా రుక్మిణి వసంత్ నటించింది. ఇక సైడ్ ఏ విడుదలయ్యి సూపర్ హిట్ అందుకుంది కాబట్టి సైడ్ బీ మూవీని కూడా రెండు నెలలలోపే థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. సైడ్ ఏకు ఏ విధంగా ఆదరణ లభించిందో.. సైడ్ బీకు కూడా అలాంటి పాజిటివ్ ఫీడ్ బ్యాకే దక్కింది. ‘సప్తా సాగరాలు దాటి సైడ్ ఏ’ మూవీ థియేటర్లలో రన్ అవుతున్నప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. కానీ సైడ్ బీకి మాత్రం మేకర్స్ ఇంత సమయం తీసుకుంటున్నారు.
ఇద్దరు హీరోయిన్లు..
‘‘ఎస్ఎస్ఈ సైడ్ బీ’ త్వరలోనే అమెజాన్‌లోకి వచ్చేస్తోంది. కన్ఫర్మ్ అవ్వగానే డేట్స్ చెప్తాం’ అంటూ తన ట్విటర్ ద్వారా బయటపెట్టాడు రక్షిత్ శెట్టి. ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’లో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్‌తో పాటు చైత్ర జే ఆచార్ కూడా మరో కీలక పాత్రలో కనిపించింది. సైడ్ ఏ చిత్రం.. రక్షిత్ శెట్టి జైలు నుండి విడుదలయిన దగ్గర ఆగిపోతుంది. అప్పటికే హీరోయిన్‌కు పెళ్లి కూడా అయిపోతుంది. అలా సైడ్ ఏ ఎక్కడైతే ముగిసిందో.. సైడ్ బీ అక్కడి నుండే మొదలవుతంది. దర్శకుడు హేమంత్ రావు.. ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఏ’నే ఎమోషనల్‌గా తెరకెక్కించి ఆడియన్స్‌ను కన్నీళ్లు పెట్టించాడు అనుకుంటే సైడ్ బీ.. దాని క్లైమాక్స్ మరింత ఎమోషనల్‌గా డిజైన్ చేశాడు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజికే ప్రాణం..
‘సప్త సాగరాలు దాటి సైడ్ ఏ’లో వైలెన్స్ ఎక్కువగా చూపించని దర్శకుడు.. సైడ్ బీలో మాత్రం వైలెన్స్ శాతాన్ని కాస్త ఎక్కువగానే పెట్టాడు. పరమ్వాహ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. చరణ్ రాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. రెండు పార్ట్స్‌కు ప్రాణంగా నిలిచింది. నవంబర్ 17న ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’ మూవీ థియేటర్లలో విడుదలయ్యింది. ఆ తర్వాత నెలరోజులకే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని ప్రచారం కూడా మొదలయ్యింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ పార్ట్‌నర్ అంటూ పోస్టర్ కూడా విడుదలయ్యింది. కానీ ఉన్నట్టుండి ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’ ఓటీటీ రిలీజ్ ఆగిపోయింది. ఇక త్వరలోనే ఈ మూవీని ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చని రక్షిత్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Also Read: 'అల వైకుంఠపురములో' రికార్డ్‌ని అలా బ్రేక్ చేసేసిన 'హను-మాన్'