Salaar OTT Update: చాలాకాలం తర్వాత ప్రభాస్‌కు మాత్రమే కాకుండా తన ఫ్యాన్స్‌కు కూడా ‘సలార్’తో ఊరట లభించింది. తమ ఫేవరెట్ హీరోను తాము ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలాగే చూపించి ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఫుల్‌గా సంతోషపెట్టాడు ప్రశాంత్ నీల్. ఇక సంక్రాంతికి ఎన్నో సినిమాలు థియేటర్లలో సందడి చేయడంతో ‘సలార్’ జోరు కాస్త తగ్గింది. ఫైనల్‌గా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఏది అని రూమర్స్ వైరల్ అవుతుండగా.. రిలీజ్ డేట్ గురించి కూడా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.


‘సలార్’తో ప్రభాస్‌కు హిట్


ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ‘సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్’. ఇప్పటికే ‘కేజీఎఫ్’ చాప్టర్1, చాప్టర్ 2లతో ప్యాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్‌ను చాలా స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించాడు. అందుకే ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ సినిమా అనగానే లుక్స్ పరంగా తమ హీరోను చాలా స్టైలిష్‌గా చూపిస్తాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్టుగానే మూవీ నుండి విడుదలయిన మొదటి గ్లింప్స్‌తోనే అందరినీ ఆకట్టుకుంది ‘సలార్’. ఫైనల్‌గా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే సమయం వచ్చేసిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.


ఓటీటీ రిలీజ్ కోసం వెయిటింగ్


‘సలార్’ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఫిబ్రవరీ 4 నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుందని చర్చలు మొదలయ్యాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ‘సలార్’ స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికీ ‘సలార్’ మేకర్స్ గానీ, నెట్‌ఫ్లిక్స్ గానీ.. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ దాదాపు ఫిబ్రవరీ 4నే రిలీజ్ డేట్‌గా ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్.. మళ్లీ మళ్లీ చూడడానికి థియేటర్లకు వెళ్లారు. ఇక థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మళ్లీ మళ్లీ చూసిన ఫ్యాన్స్ కూడా ఓటీటీలో తమ అభిమాన హీరో సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు.


వారిద్దరి బాండింగ్ హైలెట్


‘సలార్’లో దేవ పాత్రలో ప్రభాస్ కనిపించగా.. తన ప్రాణ స్నేహితుడైన వరద పాత్రలో మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ నటించాడు. సినిమాలో వీరిద్దరి బాండింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వీరితో పాటు జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, ఈశ్వరి రావు.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. ‘కేజీఎఫ్’ రెండు చాప్టర్స్‌కు మ్యూజిక్ అందించిన రవి బాస్రూర్.. ‘సలార్’కు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ‘సలార్’కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. త్వరలోనే ‘సలార్ పార్ట్ 2’ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది వరకు ‘సలార్ పార్ట్ 2’ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్తారని తెలుస్తోంది.


Also Read: ముందే ఫిక్స్ అయ్యా, చివరి సినిమా ఇదే కావచ్చు - మహేశ్ బాబు