HanuMan OTT Release Date: 2024 సంక్రాంతికి విడుదలయిన అన్ని సినిమాల్లో ‘హనుమాన్’ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికీ పలు ప్రాంతాల్లోని థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పటికీ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికి కొందరు ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. కానీ థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు మాత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ‘హనుమాన్’ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వినిపించనుంది మూవీ టీమ్. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.


స్ట్రీమింగ్ ఎక్కడంటే..


‘హనుమాన్’ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 దక్కించుకుందని సమాచారం. కానీ ఇప్పటికీ ఈ సినిమాకు థియేటర్లలో ఆదరణ లభిస్తోంది కాబట్టి వెంటనే ఓటీటీలో విడుదల చేయకూడదని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇప్పటికీ పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. ఈరోజుల్లో థియేటర్లలో విడుదలయిన నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి చిత్రాలు. ఎంత స్టార్ హీరో సినిమా అయినా ఇదే పరిస్థితి. కానీ ‘హనుమాన్’ మాత్రం థియేటర్లలో విడుదలయ్యి దాదాపు రెండు నెలలు అవుతున్నా.. ఇంకా ఓటీటీలోకి మాత్రం రాలేదు. తాజాగా దీని ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


మళ్లీ పండగకే..


ముందుగా మార్చి 2న ‘హనుమాన్’ను స్ట్రీమ్ చేయాలని జీ5 అనుకుంది. కానీ అది కుదరలేదు. అందుకే శివరాత్రి కానుకగా మార్చి 8న ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండగగకు థియేటర్లలో రచ్చ చేసిన ‘హనుమాన్’.. ఇప్పుడు శివరాత్రికి ఓటీటీ రికార్డులను తిరగరాయడానికి రానుందని సమాచారం. ఇక ఈ సినిమా ఓటీటీలోకి రాకముందే దీని సీక్వెల్.. అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోని రెండో చిత్రమైన ‘జై హనుమాన్’ను ప్రారంభించాడు దర్శకుడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కోసం అమెరికాకు కూడా వెళ్లాడు. అంతే కాకుండా ‘జై హనుమాన్’లో హనుమంతుడిగా నటించడం కోసం స్టార్ హీరోను క్యాస్ట్ చేసుకోవాలని సన్నాహాలు కూడా మొదలుపెట్టాడు.






రూ.300 కోట్లకు పైగా..


తేజ స‌జ్జ హీరోగా, ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్ లో సంక్రాంతికి బ‌రిలో నిలిచిన సినిమాలు అన్నింటిలో 'హ‌నుమాన్' సూప‌ర్ హిట్‌ను సాధించింది. ఇప్ప‌టికే దాదాపు రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది ఈ సినిమా. ‘హనుమాన్’ రిలీజ్ అయ్యి దాదాపు 50 రోజులు అవుతున్న థియేటర్లలో క్రేజ్ మాత్రం తగ్గలేదు. తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లో మాత్రమే కాకుండా.. నార్త్‌లో కూడా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. అక్కడ స‌రికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం హిందీలో మాత్రమే రూ.50 కోట్లు సాధించిన అతి త‌క్కువ తెలుగు సినిమాల జాబితాలోకి చేరిపోయింది ‘హ‌నుమాన్’. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతగా ఆదరించారో.. అదే రేంజ్‌లో హిందీ ఆడియన్స్ కూడా ప్రేమను కురిపించారు.


Also Read: ఇలాగేనా మాట్లాడేది? లైవ్ షోలో హోస్ట్ చెంప పగలగొట్టిన సింగర్, వీడియో వైరల్