మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా యాక్ట్ చేసిన న్యూ ఏజ్ ఫిల్మ్ 'గామి' (Gaami Movie). మార్చి 8న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ 12న ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చెయ్యడం స్టార్ట్ చేసింది.


'జీ5'లో విడుదలైన 72 గంటల్లో అరుదైన రికార్డు
ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'లో ఏప్రిల్ 12న 'గామి' రిలీజ్ అయ్యింది. అంటే 11వ తేదీ రాత్రి నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. ఓటీటీలో విడుదలైన 72 గంటల్లో ఈ సినిమా అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కంప్లీట్ చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.


Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!






72 గంటలు అంటే... 4320 నిమిషాలు. ఆ సమయంలో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ 50 లక్షల నిమిషాల పాటు 'గామి'ని జనాలు చూశారన్నమాట. సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంతో 'జీ 5' సంతోషంగా ఉంది. 2024 ఫస్ట్ బ్లాక్ బస్టర్ 'హను-మాన్', ఇప్పుడు 'గామి' సినిమాలు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.


Also Readవిశాఖ నడిరోడ్డు మీద అర్ధరాత్రి అమ్మాయిల పడిగాపులు... ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ అరాచకాలకు నరకం చూసిన ప్రయాణికులు



Gaami Movie Cast And Crew: విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' సినిమాలో తెలుగు అమ్మాయి చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌ పతాకంపై కార్తీక్ శబరీష్ ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి నరేష్ కుమారన్ సంగీత దర్శకుడు, విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.


Also Readప్లాన్ మార్చిన దిల్ రాజు... ఈ నెలాఖరులోనే ఓటీటీలోకి విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'?



'గామి' సినిమా కథ ఏమిటంటే?
Gaami Movie Story: శంకర్ (విశ్వక్ సేన్) ఒక అఘోరా. అతని శరీరానికి మానవ స్పర్శ తగిలితే వింత వింత మార్పులకు గురి అవుతుంది. ఆ సమస్యకు కారణం ఏమిటి? అతను దాని బారిన ఎలా పడ్డాడు? అతని గతం ఏమిటి? అనేది అతడికి కూడా గుర్తు లేదు. మూడు పుష్కరాలకు (36 ఏళ్లకు) ఓసారి హిమాలయాల్లోని ద్రోణ గిరి ప్రాంతంలో పూసే మాలి పత్రాలు అనే ప్రత్యేకమైన పువ్వుల్ని సేవిస్తే సమస్య తీరుతుందని శంకర్ తెలుసుకుంటాడు.


శంకర్ కథ పక్కన పెడితే... సీటీ 333ది మరో కథ. ఇండో - చైనా సరిహద్దు ప్రాంతాల్లో మనుషులపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ ప్రయోగశాల నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలని సీటీ 333 (మహ్మద్ సమద్) అని ఓ టెస్ట్ సబ్జెక్ట్ విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. శంకర్, సీటీ 333తో పాటు దక్షిణ భారతదేశంలోని ఓ ఊరిలో దేవదాసి దుర్గ (అభినయ), ఆమె కుమార్తె ఉమ (హారిక)కు సంబంధం ఏమిటి?అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.