సుమంత్ (Sumanth Kumar Yarlagadda) ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ సినిమా 'అనగనగా'(Anaganaga Movie Sumanth). సన్నీ సంజయ్ దర్శకత్వం వహించారు. ఇందులో సుమంత్ సరసన కాజల్ చౌదరి కథానాయికగా నటించారు. రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించిన ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారు అయ్యిందని తెలిసింది.
ఉగాదికి ఓటీటీలోకి రావాల్సిన సినిమా...ఇప్పుడు మే నెలకు షిఫ్ట్ అయ్యింది, ఎప్పుడంటే?Anaganaga ETV Win release date: 'అనగనగా...'ను మొదట ఉగాదికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. తెలుగు సంవత్సరాది సందర్భంగా స్ట్రీమింగ్ చేస్తామని ఈటీవీ విన్ అనౌన్స్ చేసింది కూడా! అయితే... ఉగాదికి ఓటీటీలోకి రాలేదు. మే నెలకు షిఫ్ట్ అయ్యింది.
మే 9వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో 'అనగనగా' స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ సినిమాలో టీచర్ రోల్ చేశారు సుమంత్. చిన్నారులకు ఏ విధంగా పాఠాలు బోధిస్తే అర్థం అవుతుందో చెప్పే ఉపాధ్యాయుడిగా ఆయన కనిపించనున్నారు. ఇందులో నటుడు - దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కూడా ఓ స్పెషల్ రోల్ చేశారు.
Also Read: మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
సుమంత్ కుమార్ యార్లగడ్డ, కాజల్ చౌదరి జంటగా... అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మాస్టర్ విహార్ష్, అను హసన్, రాకేష్ రాచకొండ, బీవీఎస్ రవి, కౌముది నేమాని ప్రధాన తారాగణం. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్: ప్రియాంక వీరబోయిన, ప్రొడక్షన్ డిజైనర్: ఎల్లోల్ డిజైన్ స్టూడియో అరవింద్ మ్యూల్ & చంద్రిక గొర్రెపాటి, సౌండ్ డిజైనర్: అశ్విన్ ఆర్, ఎడిటర్: వెంకటేష్ చుండూరు, కెమెరా వర్క్: పవన్ పప్పుల, కో డైరెక్టర్: గురు కిరణ్, సహ రచయిత: దీప్తి, సంగీతం: చందు రవి, రచన - దర్శకత్వం: సన్నీ సంజయ్, నిర్మాతలు: రాకేశ్ రెడ్డి గడ్డం - రుద్రా మదిరెడ్డి.
Also Read: రాశీ కాదు... హాటీ... రెడ్ స్విమ్‌సూట్‌లో సెక్సీగా బ్యూటిఫుల్ ఖన్నా, ఫోటోలు చూడండి