Dune: Part Two OTT Release Date: 2021లో విడుద‌లైన 'డ్యూన్ పార్ట్ - 1' హాలీవుడ్ సినిమా భారీ విజ‌యం సాధించింది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. కరోనా టైంలో కూడా ఆ రేంజ్ క‌లెక్ష‌న్లు వ‌చ్చాయంటే సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఫ‌స్ట్ పార్ట్ కి ఆరు ఆస్కార్ అవార్డులు కూడా వ‌చ్చాయి. దీంతో ఈ సినిమా సీక్వెల్ ఎలా ఉండ‌బోతుందో అని అంద‌రూ ఎదురుచూశారు. ఇక ఈ మ‌ధ్య ఆ సినిమాకి సీక్వెల్ కూడా రిలీజ్ అయ్యింది. మార్చి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది 'డ్యూన్ - 2'. ఇక ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మ‌రి స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్క‌డ స్ట్రీమ్ అవుతుందో చూసేద్దాం.


ఏప్రిల్ 16న..


'డ్యూన్ - 2' సినిమా మార్చి 1న రిలీజ్ అయ్యింది. మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇది ఎప్పుడెప్పుడు ఓటీటీల్లోకి వ‌స్తుందా? అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేప‌థ్యంలో 'డ్యూన్ - 2' ఏప్రిల్ 16న ఓటీటీల్లోకి వచ్చేసింది. ఈ సినిమా యాపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్, గూగుల్ ప్లే, వుడూలో ప్రీమియ‌ర్ అవుతోంది. డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్ లోనే కాకుండా ఈ సినిమా.. బ్లూ రే, డీవీడీ, 4కే యూహెచ్‌డీలో కూడా రిలీజ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రెంట్‌కు అందుబాటులో ఉంది. హిందీలో మాత్రమే ఉంది.


క‌థేంటంటే? 


ఫస్ట్ పార్ట్‌లో తండ్రిని కోల్పోయిన తర్వాత శత్రువుల నుంచి తల్లి లేడీ జెస్సికాతో (రెబెక్కా ఫెర్గూసన్) పారిపోతాడు పాల్ అట్రీడియస్ (తిమోతి షాలామే). అలా పారిపోతూ అరాకిస్ గ్రహంలో విప్లవ కారులైన ఫ్రెమెన్ తెగ ప్రజలతో చేరతాడు. వీరందరూ తమ గ్రహాన్ని కాపాడే రక్షకుడు వస్తాడని ఎప్పుడో పూర్వీకుల కాలం నాటి గ్రంథాల్లో రాసిన భవిష్యవాణిని నమ్ముతారు. దీన్ని జెస్సికా క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. తన కొడుకే వీరు వెతుకుతున్న రక్షకుడని నమ్మించి ఆ తెగల వారిని తన అధీనంలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది. పాల్ అట్రీడియస్‌కు రాజు అవ్వాలన్న కోరిక ఉండదు. ఫ్రెమెన్ తెగలో ఈ భవిష్యవాణిని నమ్మని వారు కొందరు ఉంటారు. వారిలో చాని (జెండాయా)... పాల్‌తో ప్రేమలో పడుతుంది. ఫ్రెమెన్ తెగతో కలిసి అరాకిస్‌లో మాత్రమే దొరికే ఒక రకమైన డ్రగ్ అయిన స్పైస్‌ని తీసే హార్కొనెన్ తెగ వారిపై దాడులు చేసి వారిని బలహీనపరుస్తూ ఉంటాడు. మొదటి భాగంలో పాల్ తండ్రిని చంపేది ఈ తెగకు చెందిన వారే. తండ్రిని చంపిన వారిపై పాల్ పగ తీర్చుకున్నాడా? జెస్సికా ఆశించినట్లు పాల్ రక్షకుడి అవతారం ఎత్తాడా? అసలు చివరికి ఏమైంది? అన్నది తెలియాలంటే ‘డ్యూన్ పార్ట్ 2’ చూడాల్సిందే.


న‌టీన‌టులు ఎవ‌రంటే? 


ఈ సినిమాలో హాలీవుడ్ న‌టులు తిమోతి షాలామే, జెండాయా, రెబెక్కా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్ తదితరులు న‌టించారు. ఫ్రాంక్ హెర్బెర్ట్ రాసిన డ్యూన్ పుస్తకం ఆధారంగా ఈ క‌థ‌ను రాశారు. హాన్స్ జిమ్మర్ సంగీతం అందించ‌గా.. డెనీ విల్నెవ్, జాన్ స్పాయిట్స్ స్క్రీన్ ప్లే. డెనీ విల్నెవ్ ద‌ర్శ‌కుడు. లెజండ‌రీ పిక్చ‌ర్స్, విల్నేవ్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించారు ఈ సినిమాని. 


Also Read: జ‌య‌ల‌లిత‌తో తిర‌గొద్ద‌ని శ‌ర‌త్ బాబుకి చాలాసార్లు చెప్పా - నటుడు చిట్టిబాబు