Actor Chitti Babu Revealed Sharath Babu & Jayalalitha Relation: కమెడియన్ చిట్టిబాబు. అలనాటి నటుడు రాజాబాబు తమ్ముడిగా అందరికీ పరిచయం. ఇక చిట్టిబాబు కూడా ఎన్నో కామెడీ పాత్రలు వేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన చేసిన ప్రతి పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఆయన నటనకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే, చాలాకాలం తర్వాత ఆయన స్క్రీన్ మీద కనిపించారు. ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు చిట్టిబాబు. ఈ సందర్భంగా అప్పటి విషయాలను ఎన్నో గుర్తు చేసుకున్నారు. దాంట్లో భాగంగా రమాప్రభ, శరత్ బాబు గురించి చెప్పుకొచ్చారు. శరత్ బాబు, జయలలిత మధ్య ఉన్న సంబంధం గురించి ప్రస్తావించారు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు ఆయన.
అన్నయ్య పట్టించుకోలేదు..
రాజాబాబు, రమాప్రభ కాంబినేషన్ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. వాళ్లిద్దరు కలిసి నటించిన సినిమా అద్భుతంగా ఉండేది. అలాంటిది ఆమె శరత్ బాబును పెళ్లి చేసుకున్నప్పుడు రాజాబాబు పట్టించుకోలేదని అది ఆమె ఇష్టమని చెప్పాడని అన్నారు. "నిజం చెప్పాలంటే మా అన్నయ్య రమాప్రభతో మామూలుగానే మాట్లాడతాడు. ఆమెతో షూటింగ్స్ చేయడం.. అంతవరకే. అంతకు మించి ఏమీ లేదు. అన్నయ్యకు, శరత్ బాబుకి పెద్దగా పరిచయం లేదు. రమాప్రభను పెళ్లి చేసుకున్నాడు అని మాత్రమే తెలుసు. అలా హాయ్ అంటే హాయ్ బాయ్.. అంటే బాయ్ అన్నట్లు ఉండేవాడు అన్నయ్య. నేను ఏంటంటే? మేమంతా కలిసి డ్రామాకి రిహార్సెల్స్ చేసేవాళ్లం. దాంట్లో శరత్ బాబు హీరో.. అలా నెలలు నెలలు ఆయనతో కలిసి ఉండేవాళ్లం. రాజేంద్రప్రసాద్ అప్పుడు ఇన్ స్టిట్యూట్ లో చదివేవాడు. రాజేంద్రప్రసాద్ చేసుకుంది. రమా ప్రభ అక్క కూతురిని. అలా అలా మా అందరికీ బాగా పరిచయం. ఆ అమ్మాయి ఇష్టం ఆ అమ్మాయిది. పెళ్లి చేసుకోవడం అదంతా. అందుకే, ఆ విషయాన్ని అన్నయ్య పట్టించుకోలేదు. ఏమీ అడగలేదు కూడా. తన ఇష్టం కదా. స్వతంత్రంగా ఉండాలి, డెసిషన్ తీసుకోవాలి. అందుకే, కలగజేసుకోలేదు. రమాప్రభను అక్క అని పిలిచేవాడిని, శరత్ బాబును బావా అని పిలిచేవాడిని అందరం క్లోజ్ గా ఉండేవాళ్లం. అలా రమా ప్రభ తమ్ముడు రెడ్డి పెళ్లి మేం ముగ్గురం దగ్గరుండి చేశాం. అలా రాజేంద్రప్రసాద్ పెళ్లి కూడా మేమే దగ్గరుండి చేశాం. అంతేకాని, వాళ్లు విడిపోవడం అదంతా మేం పెద్దగా పట్టించుకోలేదు" అని చెప్పారు చిట్టిబాబు.
శరత్ బాబు వేదాంతి..
"శరత్ బాబు ఒక వేదాంతి. ఆ పర్సనాలిటీకి నేను 102 ఏళ్లు కచ్చితంగా బతుకుతాను అనేవాడు. 20 సార్లు ఆ మాట చెప్పి ఉంటాడు. యాత్రలు చేస్తుండేవాడు, నైమిశారణ్యం వెళ్లేవాడు, పూజలు చేసేవాడు. శరత్ బాబుకి ఇంటి బాధ్యత చాలా ఎక్కువ. వాళ్లు 12 మందో 14 మందో సంతానం. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములను సెటిల్ చేశాడు. ఇలా షెడన్ గా అవుతాడని అనుకోలేదు."
జయలలితతో రిలేషన్ వద్దు అన్నాను..
"ఆర్టిస్ట్ జయలలితతో బాగా ఉండేవాడు. గుడికి అలా వెళ్లేవాడు. ఇవన్నీ పెట్టుకోవద్దు అని చెప్పాను. అప్పుడు జస్ట్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అనేవాడు. ఆ తర్వాత తమిళ్ ఆర్టిస్ట్ కూతురిని ఏదో పెళ్లి చేసుకున్నాడు. కానీ, అతను మాత్రం 102 ఏళ్లు బతుకుతానని ఎప్పుడూ చెప్పేవాడు. అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే. కానీ, అన్నయ్య పోయిన తర్వాత మాత్రం రమాప్రభ ఒక మాట అన్నాది. పోయాడని తెలియపరచలేదు అని ఏడిచింది. మీ అన్నయ్య చచ్చిపోవడం కాదురా.. వాడు నన్ను కూడా చంపేశాడురా. వాడు చచ్చిపోయాక ఎవరి పక్కన యాక్ట్ చేయబుద్ధి కావడం లేదురా అని ఏడ్చేసింది. అంత మంచి జోడి వాళ్లది. ‘తోట రాముడు’ సినిమాలో నేను రమాప్రభ జోడీ. కానీ, జనాలు రిసీవ్ చేసుకోరు అని చేయలేదు" అని తనకు తెలిసిన విషయాలను జ్ఞాపకాలను పంచుకున్నారు చిట్టిబాబు.
Also Read: మీరంతా చిరంజీవిని కిడ్నాప్ చేశారు కదా? - ‘పారిజాత పర్వం’ టీమ్‌తో సుమ ఫన్