Suma Makes Fun Of Paarijatha Parvam Team: యాంక‌ర్ సుమ‌.. టాలీవుడ్ లో ప్రతి సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఈమె క‌చ్చితంగా క‌నిపిస్తారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్నీ ప్ర‌మోషన్స్, ఈవెంట్ లో క‌నిపిస్తారు సుమ‌. అంత బిజీ బిజీగా గ‌డుపుతారు. అయితే, రోజుకు ఎన్ని షూట్లు చేసినా, ఈవెంట్లు చేసినా ఎనర్జీ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌దు. ఫ‌న్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. స్పాంటేనియ‌స్ గా జోకులు పేలుస్తూ త‌ను న‌వ్వుతూ అవ‌త‌లి వాళ్ల‌ను న‌వ్విస్తుంటారు ఆమె. ఇప్పుడిక పారిజాత ప‌ర్వం టీమ్ తో ఆమె సంద‌డి చేశారు. సినిమా టీమ్ ని ఒక రేంజ్ లో ఆడుకున్నారు. త‌న‌ని కిడ్నాప్ చేస్తే ఎలా ఉంట‌దో చూపిస్తా అంటూ ఫ‌న్ చేశారు సుమ‌. 


చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన తాజా చిత్రం ‘పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజైన ఫస్ట్ లుక్, కాన్సప్ట్ వీడియో, సాంగ్స్, డిఫరెంట్ పోస్టర్స్ అన్నిటికీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న తరుణంలో మూవీ ప్ర‌మోష‌న్స్ ని గ‌ట్టిగా ప్లాన్ చేసింది చిత్ర బృందం దాంట్లో భాగంగా యాంక‌ర్ సుమ‌తో మూవీ టీమ్ ముచ్చ‌టించింది. 


వ‌చ్చి రాని తెలుగుతో శ్ర‌ద్ధ దాస్.. 


వ‌చ్చి రాని తెలుగుతో హీరోయిన్ శ్ర‌ద్ధ దాస్ మాట్లాడిన మాట‌ల‌కు సుమ గ‌ట్టిగా న‌వ్వేశారు. "న‌న్ను ఏంటి గేదె అనుకుంటున్నారా?" అంటూ కామెడీ చేసింది సుమ‌. నిజానికి ఈ సినిమా కిడ్నాప్ చేసే క‌థ‌. దీంతో సుమ‌ను కిడ్నాప్ చేసేందుకు శ్ర‌ద్ధ దాస్, వైవా హ‌ర్ష ఇద్ద‌రు.. చిన్న తాడు తీసుకొస్తారు దాంతో అక్క‌డే ఫ‌న్నీ కాన్వ‌ర్జేష‌న్ క్రియేట్ అయ్యింది. 


"అది పిల్లాడి డైప‌ర్ తాడంట కూడా లేదు న‌న్ను దాంతో కిడ్పాన్ చేస్తారా? అయినా, ఈ కాన్పెస్ట్ ఏదో బాగుంది.. న‌న్ను కిడ్నాప్ చేసినందుకు కూడా నేను రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయొచ్చు అయితే. మీరు న‌న్ను కిడ్నాప్ చేస్తారు క‌దా.. దానికి రివేంజ్ తీర్చుకుంటాను. మీరు కిడ్నాప్ చేసింది ఎవ‌రో చెప్పేస్తున్నాను. చిరంజీవిని కిడ్నాప్ చేశారు క‌దా?" అంటూ మూవీ టీమ్ తో ఫ‌న్నీగా మాట్లాడారు సుమ‌. "మీరు బిజీగా ఉంటార‌ని, మూడు ఈవెంట్ల‌కు డేట్లు ఇవ్వ‌రేమో అని కిడ్నాప్ చేశాం" అంటూ సినిమా డైరెక్ట‌ర్ చెప్పుకొచ్చారు సుమ‌కి. 


'పారిజాత పర్వం' చిత్రంలో మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, టార్జాన్, గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రీ సంగీతం సమకూర్చగా.. బాల సరస్వతి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై  మహీధర్ రెడ్డి, దేవేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనంత సాయి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read: తరుణ్ అందుకే సినిమాలు చేయడం లేదు, మోహన్ బాబు ఫ్యామిలీ కూడా కష్టపడుతోంది: ఎంఎస్ నారాయణ కొడుకు విక్ర‌మ్