Pradeep Ranganathan's Dude Movie Trending In Top Place : కోలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'డ్యూడ్' ఈ నెల 14న ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా... రెండు రోజుల్లోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Continues below advertisement

దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'డ్యూడ్' మూవీ మంచి టాక్ సొంతం చేసుకుని... కేవలం 6 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. రీసెంట్‌గానే ఓటీటీలో తమిళం, తెలుగుతో పాటు కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 2 రోజుల్లోనే టాప్ ప్లేస్‌లోకి వచ్చేసింది. ఈ మేరకు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read : ది వరల్డ్ ఆఫ్ 'వారణాసి' - సృష్టి ఆవిర్భావం To కలియుగం... రామయ్యను ఎత్తుకున్న వానర సైన్యం... అసలు స్టోరీ ఏంటంటే?

మూవీలో ప్రదీప్ సరసన ప్రేమలు ఫేం 'మమితా బైజు' హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే శరత్ కుమార్, రోహిణి, ద్రవిడ్ సెల్వం, హృదు హరూన్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించగా... సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు. 

స్టోరీ ఏంటంటే?

Dude Review : రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె కుందన (మమితా బైజు). చిన్నప్పటి నుంచీ తన మేనత్త కుమారుడు గగన్ (ప్రదీప్ రంగనాథన్)ను ఇష్టపడుతుంది. అయితే, గగన్‌కు మాత్రం కుందన అంటే ఇష్టం ఉండదు. స్కూల్, కాలేజీల్లో లవ్ ఫెయిల్యూర్ అయ్యి వరుస బ్రేకప్స్ అవుతాయి. అటు గగన్ తనతో పెళ్లికి నిరాకరించడంతో కుందన డిప్రెషన్ నుంచి బయటపడేందుకు బెంగుళూరు వెళ్లిపోతుంది.

అయితే, కుందన తన నుంచి దూరం కావడంతో గగన్‌కు ఆమె అంటే ఇష్టం పెరుగుతుంది. తన మామయ్య దగ్గరకు వెళ్లి పెళ్లి చేయాలని కోరగా... ఓకే అంటాడు. ఇదే టైంలో బెంగుళూరులో కుందన వేరే వ్యక్తిని ఇష్టపడిందని గగన్‌కు తెలుస్తుంది. ఈ క్రమంలో గగన్ ఏం చేశాడు? తన మరదలి లవ్ కోసం బావ ఏం చేశాడు? వీరి లవ్ సక్సెస్ అయ్యి పెళ్లి పీటలెక్కిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.