Pradeep Ranganathan's Dude OTT Streaming: కోలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా 'డ్యూడ్'. ఇందులో మలయాళ హిట్ 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది? అనేది చూస్తే...
నెట్‌ఫ్లిక్స్‌లో 'డ్యూడ్'... ఐదు భాషల్లో!Dude streaming on Netflix: డ్యూడ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఓటీటీలోకి ఈ రోజు సినిమాను తీసుకు వచ్చింది. తమిళంలో తెరకెక్కించిన 'డ్యూడ్'ను తెలుగులోనూ విడుదల చేశారు. రెండు భాషల్లో సినిమా విజయం సాధించింది.
తమిళం, తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది నెట్‌ఫ్లిక్స్. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాకు ఓటీటీ వ్యూవర్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
డ్యూడ్... బాక్సాఫీస్ బరిలో 100 కోట్లు!ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమాకు థియేటర్లలో రెస్పాన్స్ అదిరింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు థియేటర్లలో వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాతో కీర్తీశ్వరన్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.
Also Read: కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - అనౌన్స్ చేశారు కానీ...
అసలు 'డ్యూడ్' కథ ఏమిటి? ఏముంది?Dude Story: గగన్ (ప్రదీప్ రంగనాథన్), కుందన (మమితా బైజు) బావా మరదళ్లు. బావకు మరదలు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తాడు. ఆ బాధ నుంచి బయట పడటం వేరే సిటీ వెళుతుంది. అమ్మాయి దూరం అయ్యాక ఆ ప్రేమ తెలుసుకుంటాడు హీరో. మావయ్యకు చెబితే పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అయితే తాను వేరొక అబ్బాయితో ప్రేమలో పడ్డానని చెబుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా.
Also Read: ఎమోజీల్లో SSMB29 కథ చెప్పిన ప్రియాంక... మహేష్ సింహమే - మరి మిగతా క్యారెక్టర్లు ఎవరు?