Love Me OTT Streaming: ఒకప్పుడు సినిమా థియేటర్లలో విడుదలయిన తర్వాత అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా కనీసం నెలరోజుల పాటు ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కొన్నిరోజుల పాటు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఇదే రూల్‌ను ఫాలో అయ్యాయి. కానీ ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. థియేటర్లలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు విడుదల అవుతూ పాత సినిమాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవడంతో ఓటీటీలో వెంటనే విడుదల చేసేయడమే బెటర్ అనుకుంటున్నారు నిర్మాతలు. అలాగే ‘లవ్ మీ’ మూవీ కూడా సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.
మూడు వారాల్లోనే..
ఒక దెయ్యానికి, మనిషికి మధ్య ప్రేమకథ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ మూవీ. కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉంది అనే నమ్మకంతో సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. దానికోసం ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ కూడా చేశారు. మే 25న ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యింది. మొదటి రోజు నుండే ‘లవ్ మీ’ సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి మిక్స్‌డ్ టాక్ అందుకుంది. ఆ తర్వాత వారమే మరిన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. దీంతో ‘లవ్ మీ’కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో థియేటర్లలో విడుదలయిన మూడు వారాలలోనే ఓటీటీలోకి వచ్చేసింది.
సీక్వెల్ ఫిక్స్..
ప్రస్తుతం ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. సైలెంట్‌గా స్ట్రీమింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా.. తెలుగు భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో యావరేజ్ టాక్‌ను సంపాదించుకున్న ‘లవ్ మీ’.. ఓటీటీలో అయినా ప్రేక్షకులకు నచ్చుతుందేమో అని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంతో ముందే దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. ‘లవ్ మీ’ క్లైమాక్స్‌లో సీక్వెల్‌కు సంబంధించిన టైటిల్ కూడా ప్రకటించారు. అదే ‘కిల్ మీ ఇఫ్ యూ లవ్’.
గెస్ట్ రోల్‌లో సంయుక్త..
‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ విషయానికొస్తే.. ఇందులో ఆశిష్ రెడ్డి హీరోగా నటించాడు. తనకు జోడీగా తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా కనిపించింది. ఇప్పటికే ‘బేబి’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వైష్ణవి చైతన్య ఛార్మ్ కూడా ‘లవ్ మీ’ కోసం ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురాలేకపోయింది. ఇక ఇందులో రవికిషన్, సిమ్రాన్ చౌదరీ కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లిడి కలిసి ఈ సినిమాను నిర్మించారు. కీరవాణి.. ‘లవ్ మీ’కి సంగీతాన్ని అందించారు.
Also Read: రష్ రివ్యూ: ETV Winలో యాక్షన్ థ్రిల్లర్ - రవిబాబు సినిమా బావుందా? లేదా?