Pravan Mohanlal's Dies Irae OTT Release Date Locked : మలయాళ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'. అక్టోబర్ 31న మలయాళంలో అక్కడికి వారం రోజుల తర్వాత తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 6 రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. తాజాగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' సొంతం చేసుకోగా డిసెంబర్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అయితే, మలయాళం వెర్షన్ రిలీజ్ కన్ఫర్మ్ కాగా తెలుగు వెర్షన్ కూడా అదే రోజున ఓటీటీలోకి వస్తుందో లేదో అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా అదే రోజు నుంచే స్ట్రీమింగ్ చేయాలంటూ మూవీ లవర్స్ కోరుతున్నారు.
Also Read : ట్రెండింగ్‌లో 'అఖండ 2 మాస్సివ్ తాండవం' టీజర్ - ఒకే ఒక్క డైలాగ్... బాలయ్య విశ్వరూపం
మూవీలో ప్రణవ్ మోహన్ లాల్‌తో పాటు సుస్మితా భట్, జిబిన్ గోపీనాథ్, అరుణ్ అజికుమార్, జయ కురుప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'భ్రమ యుగం', 'భూతకాలం' వంటి హిట్ మూవీస్ తీసిన రాహుల్ సదాశివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్‌పై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ మూవీని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ స్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్ రిలీజ్ చేశారు.
స్టోరీ ఏంటంటే?
రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్) ఓ ఆర్కిటెక్ట్. ఆయన తండ్రి ఓ పెద్ద వ్యాపారవేత్త. ఇద్దరు పేరెంట్స్ అమెరికాలో ఉంటే ఫ్రెండ్స్‌తో పార్టీలు, సరదాలతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ రోజు తన ఫ్రెండ్ కణి (సుస్మితా భట్) సూసైడ్ చేసుకుందని తెలిసి వాళ్ల ఇంటికి పరామర్శకు వెళ్తాడు. అయితే, కణి ఇంటి నుంచి వచ్చిన తర్వాత అతని జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆమె ఆత్మ తన వెంట వచ్చినట్లు, తనను ఎవరో గమనిస్తున్నట్లు ఫీల్ అవుతాడు.
కణి ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచే తనకు ఇలా జరుగుతుందని గ్రహించి అసలు నిజం ఏంటో తెలుసుకునేందుకు కణి పక్కింట్లో ఉండే మధు (జిబిన్ గోపీనాథ్) సాయం కోరతాడు. వీళ్ల శోధన జరుగుతుండే క్రమంలో కణి తమ్ముడు కిరణ్ (అరుణ్ అజికుమార్) ఇంటి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోతాడు. దీనికి కారణం ఎవరు? అసలు కణి ఆత్మ రోహన్ వెంట వచ్చిందా? అతన్ని వెంటాడుతుంది ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.