Balakrishna's Akhanda 2 Massive Thaandavam Teaser Review : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో రాబోతోన్న 'అఖండ 2 తాండవం' నుంచి మరో మాస్సివ్ వీడియో వచ్చేసింది. శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా మరో టీజర్ రిలీజ్ చేశారు.

Continues below advertisement

బాలయ్య విశ్వరూపం

గతంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కంటే డిఫరెంట్‌గా గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య విశ్వరూపం చూపించారు. 'భారత్‌ను కొట్టాలంటే అక్కడి మూలాలను అడ్డం పెట్టుకునే కొట్టాలి' అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్... బాలయ్య అఖండ అఘోర తాండవంతో మరో లెవల్‌కు తీసుకెళ్లారు. భారత్‌ను విధ్వంసం సృష్టించాలనుకునే ఉగ్రవాదులను హిమాలయాల్లో ఉండే అఘోర ఎలా అడ్డుకున్నాడు? వారి పన్నాగాలను ఎలా తిప్పికొట్టాడో? అనేదే ఈ మూవీ స్టోరీ అని తెలుస్తోంది.

Continues below advertisement

ఓవైపు ఉగ్రదాడులు మరోవైపు దేశంలో ఉండే అసాంఘిక శక్తులను దైవ సహాయంతో ఓ పవర్ ఫుల్ మ్యాన్ ఎలా రక్షించాడనేదే ఈ మూవీ ప్రధానాంశం అని స్పష్టం అవుతోంది. 'కొండల్లో తొండలు పట్టుకుని తిని బతికే మీరెక్కడ. ప్రతీ కొండను క్షేత్రంగా భావించి పూజించే మేమెక్కడ' అంటూ అఘోర పాత్రలో బాలయ్య చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మంచు కొండల్లో బాలయ్య యాక్షన్ సీన్స్ చూస్తుంటే సాక్షాత్తూ పరమశివుడే త్రిశూలం చేతబట్టి నేలకు దిగి వచ్చాడా అనేలా ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవల్. సనాతన ధర్మం, భారతదేశం ఆచార సంప్రదాయాలు, ఆలయాల చరిత్ర, గొప్పదనం అన్నింటినీ వివరిస్తూ మైథలాజికల్ టచ్‌తో పాటు కొన్ని మాస్ యాక్షన్ అంశాలను కూడా మూవీలో చూపించనున్నట్లు అర్థమవుతోంది.

Also Read : మూడు నిమిషాలే... ఏ ఛాలెంజ్‌కైనా రెడీ - బాలయ్య పవర్ ఫుల్ స్పీచ్

ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య... ఈ పేరుకు తగ్గట్లుగానే మాస్సివ్‌కే మాస్ అనేలా బాలయ్య యాక్షన్ సీన్స్ ఉన్నాయంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. గతంలో వచ్చిన టీజర్, ట్రైలర్ కంటే తాజా టీజర్‌లో బాలయ్య విశ్వరూపం చూశామంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో త్రిశూలంతోనే శత్రు సంహారం చేసే సీన్ హైలెట్‌గా నిలవగా... ఈ టీజర్‌లో గదతో శత్రువులను ఒకేసారి కొట్టడం ఆ వెనుకే హనుమంతుడి దివ్యరూపం ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తమన్ మ్యూజిక్, బాలయ్య యాక్షన్‌తో సిల్వర్ స్క్రీన్ దద్దరిల్లేలా బొమ్మ కన్ఫర్మ్ అని అంటున్నారు. ఫ్యాన్స్ జోష్ మరింత పెంచేలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నారు.

థియేటర్స్ దద్దరిల్లుతాయ్

బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేయగా... పూర్ణ, హర్షాలి మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 3D ఫార్మాట్‌లోనూ మూవీ రిలీజ్ కానుంది.