Akkineni Naga Chaitanya first web series : అక్కినేని నాగ చైతన్యకు హారర్ లేదా భయపెట్టే సినిమాలు చూడటం అంటే భయం! దెయ్యాలు, ఆత్మలు, భూతాలు నేపథ్యంలో సినిమాలను ఆయన అసలు చూడరు. హార‌ర్స్‌ చిత్రాలకు దూరం అని గతంలో చెప్పారు. విచిత్రం ఏంటంటే... ఇప్పుడు ఆయన ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ చేశారు.


అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటించిన వెబ్ సిరీస్ 'దూత'. దీనికి విక్రమ్ కె. కుమార్ దర్శకుడు. ఈ రోజు వెబ్ సిరీస్ (Dhoota Web Series First Look)లో నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. జర్నలిస్టులు, ఆత్మహత్యల నేపథ్యంలో 'దూత' సిరీస్ తెరకెక్కించినట్లు ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అవుతోంది. చైతు లుక్కులో ప్రముఖ పాత్రికేయుడు, ఆత్మహత్య అక్షరాలను హైలైట్ చేశారు. 


''మిస్టరీ లేదా మెసేజ్... త్వరలో మీరు తెలుసుకుంటారు'' అని ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ పేర్కొంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో సిరీస్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. 


అమెజాన్ ప్రైమ్ వీడియోలో... 
డిసెంబర్ 1 నుంచి 'దూత'
Dhoota digital streaming release date : అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం 'దూత' వెబ్ సిరీస్ చేశారు. ఇందులో నాగ చైతన్య జర్నలిస్ట్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఆయనకు జోడిగా తమిళ కథానాయిక ప్రియా భవానీ శంకర్ కీలక పాత్ర చేశారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో విక్రమ్ కె. కుమార్ మాంచి స్క్రిప్ట్ రెడీ చేశారని, ఇందులో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటుందని టాక్. 


Also Read నేను అడిగితే బన్నీ చరణ్ సినిమాలు చేస్తారు - స్వాతి రెడ్డి గునుపాటి






డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'దూత' స్ట్రీమింగ్ కానుందని ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా చెప్పారు. మొత్తం మూడు సీజన్స్ విడుదల చేయాలని ప్లాన్ చేశారట. ఒక్కో సీజన్ లో 8 లేదా 10 ఎపిసోడ్స్ ఉంటాయట. '13 బి' సినిమాతో హారర్ నేపథ్యంలో విక్రమ్ కె కుమార్ మంచి సినిమా తీశారు. అందుకని, ఈ సిరీస్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. 


Also Read 50 రూపాయలకు 'మంగళవారం' సినిమా - ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు చూశారా?



అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కె. కుమార్... ఇద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళ కలయికలో వచ్చిన 'థాంక్యూ' ఆశించిన విజయం సాధించలేదు. కానీ, దాని కంటే ముందు 'మనం' వచ్చింది. అందులో అక్కినేని ఫ్యామిలీలో మూడు తరాలకు చెందిన హీరోలతో విక్రమ్ కె. కుమార్ చేసిన సినిమా క్లాసిక్ హిట్ అనిపించుకుంది.