Three Crime Thrillers Available To Watch On One OTT Platform : క్రైమ్, హారర్ థ్రిల్లింగ్ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ వారం ఓటీటీల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఎక్కువగా థ్రిల్ పంచనున్నాయి. తాజాగా మూడు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి? అనేది ఓసారి చూస్తే...

Continues below advertisement

క్రైమ్ థ్రిల్లర్ 'విధాత'

ఎమోషనల్, యాక్షన్ అంశాలతో కూడిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ విధాత (Vidhatha). ఈ ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. బుధవారం నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. 

Continues below advertisement

ఈ మూవీకి మణికంఠ రాజేంద్రబాబు దర్శకత్వం వహించగా... భాస్కరాచారి, శ్రీనివాసులు నాయుడు, కోటేశ్వరరావ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఓ సాధారణ వ్యక్తి కుటుంబంలో ఎదురైన ఊహించని ఘటనలపై ఎలా పోరాడాడు? తన కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసే వ్యక్తిని ఎలా ఎదిరించాడు? అనేదే స్టోరీ.

డార్క్ సీక్రెట్స్

ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్ట్రీమ్ అయిన సైకలాజికల్ థ్రిల్లర్ అంథాలజీ మూవీ డార్క్ సీక్రెట్స్ (Dark Secrets). ఇప్పటికే హంగామా (Hungama) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా... మరో ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ (Amazon Prime Video)లోనూ రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చేసింది. 

ఈ మూవీలో అప్సరా రాణి, నైనిక అనసూయ, నీలిమా చౌదరి, జయశ్రీ ప్రధాన పాత్రల్లో నటించగా... అవినాష్ కోకాటి దర్శకత్వం వహించారు. నలుగురు మహిళల జీవితాల చుట్టూ జరిగిన ఓ అంథాలజీ డ్రామా ఈ మూవీ. సామాజిక ఒత్తిడి, ఒంటరితనం, తమ వ్యక్తిగత జీవితాల్లో ఊహించని సమస్యలను నలుగురు మహిళలు ఎలా ఎదుర్కొన్నారు? అనేదే ఈ స్టోరీ. 

Also Read : Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అరబిక్ క్రైమ్ థ్రిల్లర్

అరబిక్ క్రైమ్ థ్రిల్లర్ 'అన్ఐడెంటిఫైడ్' (Unidentified). హైఫా అల్ మన్సూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిలా అల్ జహ్రానీ, షఫీ అల్ హర్తీ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తెలుగుతో పాటు అరబిక్, హిందీ, తమిళం భాషల్లో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.

సౌదీ అరేబియాలోని ఓ ఎడారి ప్రాంతంలో దొరికిన ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం చుట్టూ ఈ సినిమా స్టోరీ సాగుతుంది. ఎడారి మృతదేహం లభ్యం కాగా పోలీసులు కూడా పట్టించుకోరు. అదే స్టేషన్‌లో పని చేసే ఓ లేడీ కానిస్టేబుల్ ఆ యువతికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే స్టోరీ.

Also Read : Oh Sukumari OTT : ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.