Varsha Bollamma's Constable Kanakam OTT Streaming On ETVWin: వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించగా... రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, స్పెషల్ వీడియో భారీ హైప్ క్రియేట్ చేశాయి. కోవెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ నిర్మించారు.

ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ

ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్‌'లో అర్ధరాత్రి నుంచి సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా... ఫస్ట్ ఎపిసోడ్‌‌ను ఫ్రీగా చూడొచ్చు. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండే సిరీస్ ఆద్యంతం థ్రిల్ పంచనున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. 'ఇన్వెస్టిగేషన్ స్టార్ట్... నాన్ స్టాప్ థ్రిల్' అంటూ ఈటీవీ విన్ సోషల్ మీడియా వేదికగా హైప్ రెండింతలు చేసింది. 

Also Read: కుర్చీ కోసం యుద్ధం... మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్... రజనీకాంత్ 'కూలీ' ఫస్ట్ రివ్యూ

స్టోరీ ఏంటంటే?

1998లో ఓ గ్రామంలో జరిగే క్రైమ్ ఆధారంగా ఈ సిరీస్ సాగుతుంది. ఎప్పుడూ పండుగలు, జాతరలతో అలరారుతునే రేపల్లె గ్రామంలో అనుకోకుండా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. ముఖ్యంగా రాత్రిపూట అడవిగుట్ట ప్రాంతం వైపు వెళ్లే అమ్మాయిలు కనిపించకుండా పోతారు. వరుసగా కేసులు నమోదవుతుండడం పోలీసులకు సవాల్‌గా మారుతుంది. రాత్రి 8 గంటల తర్వాత అడవిగుట్ట వైపు ఎవరూ వెళ్లకూడదంటూ ముఖ్యంగా అమ్మాయిలు ఆ వైపు వెళ్లొద్దంటూ పోలీసులు దండోరా వేయిస్తారు. 

ఇదే సమయంలో ఆ ఊరి స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా కనకం (వర్ష బొల్లమ్మ) జాయిన్ అవుతోంది. డ్యూటీలో చేరిన రోజు నుంచే అక్కడి అధికారుల నుంచి అవమానాలు ఎదుర్కొంటుంది. అమ్మాయిల మిస్సింగ్ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని పై అధికారులు వారిస్తున్నా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎంతో సాహసంతో పట్టు వదలకుండా గ్రామంలో అసలు ఏం జరుగుతుందో అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు వరుసగా అమ్మాయిలు మిస్ కావడానికి కారణం ఏంటి? అడవిగుట్ట రహస్యం ఏంటి? రాత్రిపూట అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఉన్నది ఎవరు? కానిస్టేబుల్ కనకం ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే 'ఈటీవీ విన్' యాప్‌‌లో ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను చూసేయండి.