Coolie Review In Telugu: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కింగ్ నాగార్జున విలన్‌గా నటించిన సినిమా 'కూలీ'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. LCU (లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)కు సంబంధం లేదని, ఇదొక స్టాండలోన్ ఫిల్మ్ అని దర్శకుడు కన్ఫర్మ్ చేశారు. మరి సినిమాలో ఏముంది? ఏమిటి? అనేది ఫస్ట్ రివ్యూలో తెలుసుకోండి.

ఆ కుర్చీ కీలకం... దాని కోసం యుద్ధం!'కూలీ' ట్రైలర్ చూశారా? జాగ్రత్తగా గమనిస్తే... అందులో ఒక కుర్చీ కనబడుతుంది. ఆ కుర్చీ కోసం కొందరు చేసిన యుద్ధమే 'కూలీ'. ఆ కుర్చీలో ఏముంది? అంటే... ఈ ప్రపంచం నుంచి ఒక మనిషిని ఎటువంటి ఆధారాలు, నామరూపాలు లేకుండా మాయం చేసే శక్తి ఆ కుర్చీకి ఉంది.

స్నేహితులుగా సత్యరాజ్, రజనీకాంత్!కుర్చీని తయారు చేసిన సత్యరాజ్... నెక్స్ట్?'కూలీ' సినిమాలో రజనీకాంత్, సత్యరాజ్ స్నేహితులుగా నటించారు. ఆ కుర్చీని తయారు చేసేది సత్యరాజ్. దాని కోసం సైమన్ (నాగార్జున)తో పాటు మరికొందరు ట్రై చేస్తారు. వాళ్ళు ఎవరు? ఏమిటి? స్నేహితుడి కోసం రజనీకాంత్ ఏం చేశారు?అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో యాక్షన్ ఒక్కటే కాదు... ఉమెన్ ట్రాఫికింగ్ కూడా టచ్ చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్.

మూడు ట్విస్టులు... ఆరు యాక్షన్ బ్లాకులు...రజనీకాంత్ మార్క్ యాక్టింగ్ & లోకేష్ స్క్రీన్ ప్లే!ఇప్పటి వరకు లోకేష్ కనగరాజ్ తీసిన సినిమాలతో కంపేర్ చేస్తే... స్క్రీన్ ప్లే పరంగా 'కూలీ' ది బెస్ట్ అని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లేలో భాగంగా ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఆడియన్స్ 'వావ్' అంటూ ఒక సర్‌ప్రైజ్ ఫ్యాక్టర్‌లో సినిమా చూస్తారని తెలిసింది. మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ మీద హైప్ మరింత పెంచడం గ్యారెంటీ. అయితే ట్విస్ట్స్ అన్ని రివీల్ అయ్యాక కథ, కథనం మీద ఆడియన్స్‌లో ఆసక్తి తగ్గుతుందని చెప్పవచ్చు. 

Also Read: కూలీ ఫస్ట్ డే @ 100 కోట్లు ప్లస్... అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ము రేపుతున్న రజనీ... 'లియో'ను దాటుతుందా?

అదరగొట్టిన రజనీకాంత్... నాగ్ విలనిజం సూపర్...ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చేలా సౌబిన్ షాహిర్!దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోలకు మంచి ఎలివేషన్లు ఇస్తారు. 'కూలీ'లోనూ రజనీకి మంచి సీన్లు రాశారట. అందులో ఆయన అదరగొట్టారట. నాగార్జునను ఒక స్టైలిష్ విలన్ క్యారెక్టర్‌లో చూడటం జనాలకు కొత్తగా ఉంటుంది.

స్క్రీన్ మీద స్టైల్‌గా కనిపిస్తూ సటిల్డ్ విలనిజం చూపించారు నాగార్జున. రోలెక్స్ తరహాలో ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ ఆకట్టుకోవడం ఖాయం. అయితే అందరి కంటే మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ షాక్ ఇస్తుంది. శృతి హాసన్ డీ గ్లామర్ రోల్ చేశారు. నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో ఆవిడ ఆకట్టుకున్నారు. ప్రత్యేక గీతంలో పూజ హెగ్డే సందడి చేశారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్.

Also Readకూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?