OTT Horror Movie: అమ్మాయిని బంధించిన ఆత్మలు... పిల్ల కోసం తల్లి వెళితే... డైరెక్ట్‌గా ఓటీటీలోకి హారర్ సినిమా సీక్వెల్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Chhorii 2 OTT Release Date: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఫస్ట్ హిందీ సినిమా 'ఛత్రపతి'లో హీరోయిన్ నుష్రత్ భరూచా. హారర్ సినిమా 'ఛోరీ' సీక్వెల్ తో మరోసారి ఓటీటీలో సందడికి ఆవిడ రెడీ అయ్యింది.

Nushrratt Bharuccha's Chhorii 2 OTT Platform: నుష్రత్ భరూచ... తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మాయి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. హిందీ ప్రేక్షకులకు మాత్రం బాగా తెలుసు. అక్కడ చాలా సినిమాలు చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ 'ఛత్రపతి'లో హీరోయిన్ ఈ అమ్మాయే. ఆవిడ ప్రధాన పాత్రలో నటించిన ఒక సినిమా సీక్వెల్ త్వరలో ఓటీటీలో విడుదల కానుంది.
ఏప్రిల్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్!
Amazon Prime Video announces streaming date for Chhorii 2: నుష్రత్ భరూచ ప్రధాన పాత్రలో నటించిన హారర్ సినిమా 'ఛోరీ'. దొంగతనాన్ని చోరీ అంటారని తెలుసు. మరి, 'ఛోరీ' అంటే ఏమిటి? ఉత్తర భారతంలోని కొన్ని ప్రదేశాలలో అమ్మాయిలు లేదా మహిళలను ఛోరీ అంటారు. నవంబర్ 26, 2021న 'ఛోరీ' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రెడీ చేశారు.
ఏప్రిల్ 11వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ఛోరీ' స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో మరోసారి సాక్షి పాత్రలో నుష్రత్ కనిపించనున్నారు. ఆత్మలతో ఓ తల్లి చేసే పోరాటం వీక్షకులకు భయం కలిగించడంతో పాటు థ్రిల్ అందిస్తుందని యూనిట్ చెబుతోంది.
అసలు 'ఛోరీ 2' కథేంటి? టీజర్‌లో ఏముంది?
ఓ తల్లిని వెతుకుతూ పంట పొలం మధ్యలో ఉన్న బావి దగ్గరకు చిన్నారి వెళుతుంది. ఆ పక్కన ఉన్న ఇంటిలోకి ఆ పాపను ఆత్మలు లాక్కుని వెళతాయి. అక్కడికి తల్లి వెళుతుంది. ఆత్మల నుంచి కుమార్తెను విడిపించుకోవడం కోసం ఆ తల్లి ఎటువంటి పోరాటం చేసింది? ఆవిడకు ఎటువంటి పరిణామాలు ఎదురు అయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: 'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?