Dhruv Vikram's Bison Movie OTT Release Date Locked : కోలీవుడ్ స్టార్, చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ రీసెంట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బైసన్'. అక్టోబర్ 24న తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్  టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Continues below advertisement

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. 'కబడ్డీ అంటే మీకు కేవలం ఒక ఆట మాత్రమే కావొచ్చు. కానీ కిట్టన్‌కు కబడ్డీ అంటే లైఫ్.' అంటూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

Continues below advertisement

ఈ మూవీకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా... అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే రెజిషా విజయన్, కలైయరసన్, పశుపతి, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి మదన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో ఈ మూవీని రూపొందించారు. 

Also Read : ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు - అంతర్జాతీయ వేడుకల్లో రజనీ, బాలయ్యలకు అరుదైన గౌరవం

స్టోరీ ఏంటంటే?

1990 టైంలో కబడ్డీ బ్యాక్ డ్రాప్‌గా సాగే కథ ఇది. తమిళనాడులో మారుమూల గ్రామంలో ఉండే కిట్టన్ (ధృవ్ విక్రమ్)కు కబడ్డీ అంటే ప్రాణం. ఊరిలో కుటుంబ కక్షల కారణంగా సొంత కులం వాళ్లే వారిని దూరం పెడతారు. అతన్ని కబడ్డీ టీంలోకి తీసుకోరు. అయితే, అతనిలోని ప్రతిభను గుర్తించి స్కూల్ పీఈటీ ట్రైనింగ్ ఇస్తాడు. అలా తన టాలెంట్‌తో జపాన్‌లో జరుగుతున్న 12వ ఆసియా క్రీడలకు సెలక్ట్ అవుతాడు. జాతీయ జట్టుకు ఎంపికైనా అతనికి మైదానంలో ఆడే ఛాన్స్ మాత్రం దొరకదు. 

ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా కేవలం బెంచ్‌కే పరిమితమవుతాడు. ఇదే టైంలో టోర్నీలో ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ రద్దవుతుంది. ఈ పరిణామాలు కిట్టన్‌ను తీవ్ర నిరాశకు గురి చేస్తాయి. అసలు కిట్టన్ అక్కడి వరకూ ఎలా చేరాడు? కబడ్డీనే ప్రాణంగా భావించే అతని జీవితంలో జరిగే పరిణామాలేంటి? గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఎలా చేరాడు? కిట్టన్‌కు తండ్రి వేలు సామి (పశుపతి), అక్క రాజీ (రజిషా విజయన్) ఎలాంటి సహకారం అందించారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.