Rajinikanth Balakrishna Special Tribute At IFFI 2025 : ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి... తమ సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డులు, సత్కారాలు. లెజెండరీ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2025) వేడుకల్లో ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వీరిని ఘనంగా సన్మానించనున్నారు. 

Continues below advertisement


ఈ మేరకు కేంద్ర సమాచారం ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ కీలక ప్రకటన చేశారు. 'తమ సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని, సినీ కళామతల్లికి విశేష సేవలు అందించిన రజనీకాంత్, బాలకృష్ణలను ఘనంగా సన్మానించనున్నాం. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది ఒక మైలురాయి. వారి అద్భుత నటన, ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దశాబ్దాలుగా ఎన్నో మంచి కథలను ప్రేక్షకులకు అందించారు. వారి కృషికి గుర్తింపుగా IIFI ముగింపు వేడుకల్లో వారిని సన్మానించనున్నాం.' అని చెప్పారు. ఈ వేడుకలు గోవా వేదికగా ఈ నెల 20 నుంచి 28 వరకూ జరగనున్నాయి.


Also Read : 'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవికి తమిళంలో మరో ఛాన్స్ - తెలుగులోనూ రిలీజ్‌‍... వరుస మూవీస్‌కు గ్రీన్ సిగ్నల్


సినిమాల విషయానికొస్తే... బాలయ్య, బోయపాటి కాంబోలో 'అఖండ 2' డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2021లో వచ్చిన 'అఖండ' భారీ విజయాన్ని అందుకోగా... దీనికి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌‌గా నటిస్తుండగా... ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. 3D ఫార్మాట్‌లోనూ మూవీ రిలీజ్ కానుండగా... బాలయ్య అఖండ తాండవం చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్ 2'తో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత కమల్ హాసన్ నిర్మాణంలో ఓ మూవీలో నటించనున్నారు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా 46 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్ కానుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉంది.