Miral OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న భరత్ హర్రర్ థ్రిల్లర్ ‘మిరల్’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Miral OTT: ‘ప్రేమిస్తే’ భరత్ హీరోగా నటించిన ‘మిరల్’.. తమిళంలో విడుదలయిన రెండేళ్ల తర్వాత తెలుగులో డబ్ అయ్యింది. ఈ సినిమాకు థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ లభించింది. ఫైనల్‌గా ఇది ఓటీటీలోకి రానుంది.

Continues below advertisement

Miral OTT Release Date: చాలావరకు తమిళ హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కానీ ఒక సీనియర్ హీరో మాత్రం ఇంకా తెలుగులో తన మార్కెట్‌ను ఏర్పరుచుకోవడానికి కష్టపడుతున్నాడు. అతడే భరత్. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు.. తనను ‘ప్రేమిస్తే’ భరత్‌గానే గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత కూడా తను పలు సినిమాల్లో హీరోగా నటించినా, అందులో కొన్ని తెలుగులో డబ్ అయినా కూడా అవి ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయాయి. తాజాగా విడుదలయిన ‘మిరల్’కు కూడా అదే పరిస్థితి. థియేటర్లలో మిక్స్‌డ్ రివ్యూలు అందుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధమయ్యింది.

Continues below advertisement

రెండేళ్ల క్రితమే..

ఎం శక్తివేల్ దర్శకత్వంలో భరత్ నటించిన థ్రిల్లర్ చిత్రమే ‘మిరల్’. ఇది రెండేళ్ల క్రితమే తమిళంలో విడుదలయ్యింది. కానీ ఈ మూవీని తెలుగులో డబ్ చేసి మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. థియేటర్లలో ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ‘మిరల్’ ఓటీటీ రైట్స్‌ను ఆహా సొంతం చేసుకుంది. ఇప్పటికే ఆహా తమిళ్‌లో ‘మిరల్’ తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా దీని తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది.

ఇంట్రెస్టింగ్ పోస్టర్..

జూన్ 7న ‘మిరల్’ స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుందని ఆహా ప్రకటించింది. ‘వణుకు పుట్టించే థ్రిల్లింగ్ కథనంతో 'మిరల్'.. మీ ఆహాలో వచ్చేస్తుంది!’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్ చేసింది. దానికి తోడు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. హీరో భరత్ తలపై కారు కాలిపోతున్న విజువల్స్‌తో ఈ పోస్టర్ ఉంది. దీంతో అసలు ఈ సినిమా గురించి తెలియని వారు ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా ఉందని, ‘మిరల్’ను చూడడానికి ఎదురుచూడడం మొదలుపెట్టారు. స్కేర్ అనే ట్యాగ్ లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో పలు లోపాలు ఉన్నా కూడా థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉందని పలువురు పాజిటివ్ రివ్యూలు కూడా ఇచ్చారు.

హారర్ థ్రిల్లర్..

‘మిరల్’లో భరత్‌కు జోడీగా వాణీ భోజన్ నటించింది. వీరితో పాటు మాస్టర్ అంకిత్, కెఎస్ రవికుమార్, రాజ్ కుమార్, కావ్య అరివుమణి ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై డిల్లీ బాబు నిర్మించారు. రెండేళ్ల క్రితమే తమిళంలో విడుదలయ్యి ఇప్పుడు ఓటీటీలో కూడా అందుబాటులో ఉండడంతో ‘మిరల్’ తెలుగు వర్షన్‌ను థియేటర్లలో చూడడానికి చాలామంది ఆసక్తి చూపించలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఇలాంటి థ్రిల్లర్ మూవీ చూడడానికి చాలామందే సిద్ధంగా ఉన్నారు. హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీకి తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఎలాంటి రివ్యూలు ఇస్తారో చూడాలి.

Also Read: నాన్నకు ప్రేమతో.. పవన్ కోసం అకిరా స్పెషల్ వీడియో, సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణు దేశాయ్

Continues below advertisement
Sponsored Links by Taboola