Akira Nandan Edits Special Video On Pawan Kalyan Journey: ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తండ్రి కోసం అకిరా స్పెషల్ వీడియో క్రియేట్ చేశాడు. కాగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే పోటీ చేసిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్‌ విక్టరీని మెగా ఫ్యాన్స్‌తో పాటు కొణిదెల ఫ్యామిలీ కూడా సెలబ్రేట్ చేసుకుంది. ఆయన విజయంతో మెగా కుటుంబమంతా ఆనందంలో మునిగి తేలింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పవన్‌ తన కుమారుడు అకిరా నందన్‌ని వెంటబెట్టుకుని మంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా తన కుమారుడిని టీడీపీ అధినేత చంద్రబాబుకు పరిచయం చేశారు.


ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. ఇక తండ్రి, కొడుకులను చూసి పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అంతా తెగ మురిసిపోయారు. పవన్‌ గెలిచిన వెంటనే ఆయన మాజీ భార్య రేణు దేశాయ్‌ సైతం స్పందించారు. "పవన్‌ కళ్యాణ్‌ విజయంతో ఆద్య, అకిరాలు చాలా సంతోషంగా ఉన్నారని, ఏపీ రాష్ట్ర ప్రజలు ఈ తీర్పు నుండి ఏపీ రాష్ట్ర ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను" అంటూ మాజీ భర్త విజయాన్ని స్వాగతించారు. తాజాగా రేణు దేశాయ్‌ మరో ఆసక్తికర పోస్ట్‌ చేశారు. అకిరా తన తండ్రి పవన్‌ కళ్యాణ్‌ కోసం స్వయంగా ఎడిట్‌ చేసిన ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేస్తూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశారు. 






తండ్రి జర్నీపై తనయుడి గర్వం..


కొన్ని రోజుల క్రితం అకిరా వాళ్ల నాన్న కోసం చేసిన వీడియో ఇది ఇంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. అకిరా తన తండ్రి పవన్‌ కళ్యాణ్‌ మూవీ జర్నీ మొత్తాన్ని ఈ వీడియో పోందుపరిచాడు. ఖుషి నుంచి భీమ్లా నాయక్‌ వరకు పవన్‌ కళ్యాణ్‌ పవర్ఫుల్‌ డైలాగ్స్‌, ఇంటెన్సీవ్‌ సీన్స్‌ అన్నింటిని కలిపి వీడియోను ఎడిట్‌ చేశారు. ఇది ఆయనలోని పట్టుదల, ప్రజలకు సేవల చేయాలనే ఆయన అంకితాభావాన్ని నిర్వచిస్తుంది. అకిరా ఎడిట్‌ చేసిన ఈ వీడియో గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ఇక ఈ వీడియోను అకిరా షేర్‌ చేయమని చెప్పినట్టుగా రేణు దేశాయ్‌ వెల్లడించారు. ఈ వీడియోను ఆమె పోస్ట్‌ చేస్తూ "కొద్దిసేపటి క్రితమే అకిరా నాకు ఫోన్‌ చేసి అమ్మ నాన్న మాంటేజ్‌ వీడియో షేర్‌ చేయమని చెప్పాడు. కాబట్టి ఇది అకిరా సంతోషం కోసం చేశాను. ఎందుకుంటే నా లిటిల్‌ బాయ్‌కి వాళ్ల నాన్నపై ఉన్న ప్రేమ, తన తండ్రి జర్నీపై ఉన్న గర్వానికి ఈ వీడియో నిదర్శనం" అంటూ రేణు దేశాయ్‌ క్యాప్షన్‌‌ ఇచ్చారు.


Also Read: పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై మాజీ భార్య రేణు దేశాయ్‌ ఊహించని కామెంట్స్‌ - గ్లాస్‌ గుర్తు సింబాలిక్‌గా‌ ఆద్య వీడియో..


ప్రస్తుతం ఈ వీడియో మెగా ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో పవన్‌ మూవీ జర్నీ, ఆయన చెప్పిన పవర్ఫుల్‌ డైలాగ్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. ఈ వీడియోని చూస్తుంటే ఆయన పొలిటికల్‌ ఆశయానికి నిదర్శనంలా అనిపిస్తుంది. ఇక తండ్రి విజయాన్ని ఆకాంక్షిస్తూ అకిరా ఈ వీడియో ఎడిట్‌ చేసినట్టు అర్థమైపోతుంది. దీంతో అకిరాకు తండ్రి అంటే ఇంతా ప్రేమ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ కూటమితో కలిసి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. పిఠాపురంలో నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వంగా గీతాపై ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఒక్క సీటునే గెలుచుకున్న జనసేన ఈ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసింది. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థులు గెలిచి సత్తాచాటారు. ఇక త్వరలోనే పవన్ పిఠాపురంలో ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు.