Best Sci Fi Movies On OTT: సైన్స్ ఫిక్షన్ సినిమాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించడంలో హాలీవుడ్ దిట్ట. ముఖ్యంగా ఏలియన్స్ లాంటి కథలను హాలీవుడ్ మేకర్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కిస్తారు. అలాంటి ఒక సినిమానే ‘నోప్’ (Nope Movie). అత్యాశకు పోతే.. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అలాగే నిజంగానే మనిషికి అవసరం ఉంటే కష్టానికి తగిన ఫలితం ఎలా లభిస్తుంది? లాంటి అంశాలపై ‘నోప్’ ఆధారపడి ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ సినిమా అయినా కూడా ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా ఈ మూవీ ఉంటుంది. అందుకే చాలావరకు ఓటీటీ సబ్‌స్క్రైబర్ల నుంచి దీనికి పాజిటివ్ రివ్యూలు లభించాయి.
కథేంటీ?
కాలిఫోర్నియాలోని ఒక పల్లెటూరిలో ఓజే (డేనియల్ కలూయా), తన తండ్రి, చెల్లెలు ఎమరాల్డ్ (కేకే పాల్మర్)తో కలిసుంటాడు. ఈ కుటుంబమంతా గుర్రాలను పెంచుకుంటూ, వాటిని హాలీవుడ్ సినిమాల షూటింగ్స్‌కు రెంట్స్‌కు ఇస్తూ జీవిస్తుంటారు. ఒకరోజు ఓజే, తన తండ్రి కలిసి బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఎవరో అరుస్తున్నట్లు ఆకాశం నుంచి శబ్దాలు వస్తాయి. ఏంటా అని ఇద్దరు పైకి తలెత్తి చూస్తారు. ఆ వెంటనే నాణెల వర్షం పడుతుంది. అవి బుల్లెట్లలా దూసుకొస్తాయి. వాటిలో ఒకటి ఓజే తండ్రి కంటి నుంచి తలలోకి దూసుకెళ్తుంది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోతాడు.
తండ్రి మరణించిన తర్వాత ఓజే, తన సోదరి ఎమరాల్డ్ కలిసి గుర్రాలను రెంట్స్‌కు ఇచ్చే వ్దయాపారాన్ని కొనసాగిస్తుంటారు. ఒకరోజు గుర్రాన్ని షూటింగ్‌కు ఇవ్వగా అది అందరినీ ఇబ్బందిపెట్టడంతో, దాని తర్వాత వారి వ్యాపారం డల్ అయిపోతుంది. అదే సమయంలో అదే ప్రాంతంలో ఉండే జూప్స్ (స్టీవెన్ యూన్) అనే వ్యక్తి థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేసి రెండు చేతులా డబ్బులు సంపాదిస్తుంటాడు. వేరే దారిలేక తన గుర్రాన్ని జూప్స్‌కు అమ్మేస్తాడు ఓజే.
ఆ ప్రాంతంలో కొన్నిరోజులుగా ఆకాశంలో ఒక వింత ఆకారాన్ని గమనిస్తుంటారు ప్రజలు. ఆ ఆకారం ఎక్కడ కనిపిస్తుందో అక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులేవీ పనిచేయవు. ఇదే విషయాన్ని ఓరోజు ఓజే, ఎమరాల్డ్ మాట్లాడుకుంటూ ఉండగా.. ఆ ఆకారం ఒక గ్రహంతరవాసి అయ్యిండవచ్చని ఎమరాల్డ్‌కు అనుమానం వస్తుంది. దానిని ఫోటోలు తీసి, మీడియాకు ఇస్తే వారికి చాలా డబ్బులు వస్తాయని ఆశపడుతుంది. ఆ ప్లాన్‌కు ఓజే కూడా ఒప్పుకుంటాడు. దానికోసం సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తారు. అదే సమయంలో జూప్స్ ఏర్పాటు చేసిన థీమ్ పార్క్‌లోని మనుషులను ఆ ఏలియన్ తినేస్తుంది. కానీ అక్కడ బెలూన్లను మాత్రం తినకుండా వదిలేస్తుంది. ఇదే విషయాన్ని గమనించిన ఓజే, ఎమరాల్డ్ ఆ ఏలియన్ నుంచి ఎలా తప్పించుకుంటారు. వారు ఏం చేస్తారనేది తెరపైనే చూడాలి. ఈ మూవీ Netflixలో అందుబాటులో ఉంది. హిందీలో చూడవచ్చు.వద
సింపుల్ సైన్స్ ఫిక్షన్ కథ..
‘నోప్’లో చాలా తక్కువమంది నటీనటులు ఉంటారు. కానీ ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. ఆకాశంలో ఫ్లయింగ్ సాసర్ రూపంలో తిరిగే గ్రహాంతర వాసిని ఫోటో తీయడం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసే సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు మూవీ అస్సలు బోర్ కొట్టకుండా, చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. జోర్డన్ పీల్ తెరకెక్కించిన ఈ మూవీ 2022లో విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ను సాధించింది. ఒక సైన్స్ ఫిక్షన్ మూవీని ఇంత సింపుల్‌గా తెరకెక్కించవచ్చని ‘నోప్’తో నిరూపించాడు జోర్డన్. ఒక సింపుల్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ‘నోప్’ను ఓ లుక్కేయండి.
Also Read: ఆ స్మైల్ చూస్తే చావు దగ్గరపడినట్లే - తప్పించుకోవడం అంత ఈజీ కాదు, నవ్వుతూ చంపేయడమంటే ఇదే కాబోలు!