శివ రామచంద్ర వరపు (Shivakumar Ramachandravarapu)... తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'లో ఓ రోల్ చేశారు. నాగ చైతన్య అక్కినేని 'మజిలీ', నితిన్ 'భీష్మ', వరుణ్ తేజ్ 'తొలి ప్రేమ', నాని 'నిన్ను కోరి', అడివి శేష్ 'హిట్: ది సెకండ్ కేస్' సహా పలు సినిమాల్లో నటించారు. ఆయన హీరోగా నటించిన సినిమా 'బాలు గాని టాకీస్' (Balu Gani Talkies). వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పట్నించి అంటే...
ఆహా ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ ఫిల్మ్ 'బాలు గాని టాకీస్'. టికెట్ ఈ ఆటకే చెల్లును, మార్చబడదు... అనేది ఉప శీర్షిక. ఈ సినిమాలో శివ రామచంద్ర వరపు సరసన యువ కథానాయిక శ్రావ్య శర్మ సందడి చేయనున్నారు. ఇందులో ప్రముఖ గాయకుడు - సంగీత దర్శకుడు - నటుడు రఘు కుంచె ఓ కీలక పాత్ర చేశారు. సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి, శేఖర్ ఇతర ప్రధాన తారాగణం. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... 'తెలుగు ఇండియన్ ఐడల్ 3'లో ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. 


Also Readస్త్రీ 2 రివ్యూ: శ్రద్ధా కపూర్ మళ్లీ వచ్చిందిరోయ్... బాలీవుడ్ హారర్ కామెడీ బ్లాక్ బస్టరేనా? మూవీ ఎలా ఉందంటే?






Balu Gani Talkies Streaming Date: సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో 'బాలు గాని టాకీస్' స్ట్రీమింగ్ అవుతుందని రఘు కుంచె తెలిపారు. ఈ సినిమా గ్లింప్స్ కూడా విడుదల చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానిగా 'బాలు గాని టాకీస్'లో హీరో క్యారెక్టర్ ఉండబోతుంది. ఎలాగైనా తమ ఊరి థియేటర్లో బాలయ్య సినిమా ప్రదర్శించాలనేది అతడి కోరిక. బాలయ్య అభిమాని కనుక ఊరిలో అందరూ హీరోని బీఎఫ్ (బాలకృష్ణ ఫ్యాన్) బాలు అంటుంటారు. బాలు అనేది హీరో పేరు. ఆ విషయం తెలియక హీరోయిన్ అతడిని అడుగుతుంది. రఘు కుంచె విలన్ రోల్ చేశారని అనిపిస్తోంది గ్లింప్స్ చూస్తే!


Also Read: కుర్చీ మడత పెట్టిన ప్రభాస్ హీరోయిన్ - తెలుగు పాటలకు ఇమాన్వీ సూపర్ స్టెప్స్


''ఓటీటీలో ప్రోపర్ కమర్షియల్ సినిమా 'బాలు గాని టాకీస్'. బాలయ్య గారి మూవీ రిలీజ్ మీద ఒక టాకీస్ చుట్టూ కథ తిరుగుతుంది. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది'' అని 'బాలు గాని టాకీస్' దర్శకుడు విశ్వనాథన్ ప్రతాప్ చెప్పారు. ఈ చిత్రాన్ని శ్రీనిధి సాగర్, పి రూపక్ ప్రణవ్ తేజ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే... సమ్రన్ (Smaran) స్వరాలు, ఆదిత్య బీఎన్ నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాలూ శాండిల్యస, కాస్ట్యూమ్స్: అశ్వానాథ్ బైరి, స్క్రీన్ ప్లే: అశ్విత్ గౌతమ్.