Baby John OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ మూవీ... 'బేబీ జాన్' చూడాలంటే కండిషన్స్ అప్లై

Baby John OTT Streaming : కీర్తి సురేష్ నటించిన మొట్ట మొదటి హిందీ చిత్రం 'బేబీ జాన్' ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ సినిమాను చూడాలంటే మాత్రం ఓ చిన్న ట్విస్ట్ ఉంది.

Continues below advertisement

కీర్తి సురేష్, వరుణ్ ధావన్, వామిక గబ్బి లీడ్ రోల్స్ పోషించిన రీసెంట్ బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బేబీ జాన్'. క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ 2024 డిసెంబర్ 25న థియేటర్లలోకి వచ్చింది. కలీస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. కోలీవుడ్ హీరో విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'తేరి'కి రీమేక్ గా 'బేబీ జాన్'ను రూపొందించారు. కానీ ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఎట్టకేలకు 'బేబీ జాన్' మూవీ ఓటీటీలో అడుగు పెట్టింది. కానీ ఓటీటీలో ఈ మూవీ చూడాలంటే కండిషన్స్ అప్లై అంటుంది సదరు ఓటీటీ ప్లాట్ఫామ్. 

Continues below advertisement

'బేబీ జాన్' ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?  
'బేబీ జాన్' మూవీ 42 రోజుల థియేట్రికల్ రన్ తర్వాత ఇప్పుడు ఓటీటీలో అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఈ మూవీని చూడాలంటే కండిషన్స్ అప్లై అంటోంది ప్రైమ్ వీడియో. ఆ కండిషన్ ఏంటంటే ఈ మూవీ రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ మూవీని చూడాలంటే రూ. 249 పే చేయాల్సిందే. మరి థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమాను, రెంట్ పే చేసి ఓటీటీలో చూడడానికి మూవీ లవర్స్ సిద్ధంగా ఉన్నారా? లేదంటే ఓటీటీలో ఫ్రీగా అందుబాటులోకి వచ్చే వరకు వెయిట్ చేస్తారా? అనేది తెలియాలంటే ఈ మూవీకి ఓటీటీలో వచ్చే రెస్పాన్స్ ని బట్టి తెలుస్తుంది. 

కీర్తి సురేష్ కి తీవ్ర నిరాశ 
యాక్షన్ ప్యాక్డ్ మూవీ 'బేబీ జాన్'లో బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ విలన్ గా నటించారు. ఈ మూవీని నిర్మాతలు ప్రియా అట్లీ, మురాద్ ఖేతాని, జ్యోతి దేశ్‌పాండే ఎ ఫర్ ఆపిల్ స్టూడియోస్, సినీ1 స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించగా, థమన్ సంగీతం అందించారు. అయితే అందరి కంటే ఎక్కువగా ఈ మూవీ నిరాశపరిచింది మాత్రం కీర్తి సురేష్ నే అని చెప్పాలి. సౌత్ లో మహానటి అనే పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఫస్ట్ టైం 'బేబీ జాన్' సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. పైగా ఈ సినిమా కోసం గ్లామర్ గేట్లు కూడా ఎత్తేసింది. అంతేకాదు పెళ్లయిన వెంటనే ప్రమోషన్లకు హాజరైంది. ఇంత కష్టపడ్డప్పటికీ మొదటి మూవీనే డిజాస్టర్ టాక్ తో కీర్తి సురేష్ నిరాశ పరిచింది.

Also Readఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంకా చోప్రా మరదలు టాలీవుడ్ హీరోయినే 

'అక్క'గా కీర్తి సురేష్ 
'బేబీ జాన్' రిజల్ట్ ను పక్కన పెట్టి, ప్రస్తుతం కీర్తి సురేష్ 'అక్క' అనే వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ చేస్తోంది. ప్రముఖ డైరెక్టర్ ధర్మరాజ్ శెట్టి ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. సోమవారం ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ తో పాటు రాధికా ఆప్టే కీలక పాత్ర పోషిస్తున్నారు. 1980ల కాలంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పేట్రియాజం జానర్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే 'అక్క' అనే ఈ వెబ్ సిరీస్ లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Also Read: ఆడియన్స్‌కు పెట్టాల్సింది దద్దోజనం కాదు, బిర్యానీ... ప్రజెంట్ సాంగ్స్‌పై 'పుష్ప 2' మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Continues below advertisement
Sponsored Links by Taboola