వైవిధ్య భరిత చిత్రాల్లో నటించడంలో ముందుటాడు తమిళ నటుడు ఆర్య. ఆయన తాజాగా నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ది విలేజ్‘. షమిక్ దాస్‌గుప్త రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందుతోంది. గౌరవ్ శ్రీవాస్తవ్, ప్రసాద్ పట్నాయక్ ఈ సిరీస్ ను తెరకెక్కించారు. గ్రాఫిక్ నవల ఆధారంగా రూపొందించబడిన మొదటి భారతీయ సిరీస్ గా ‘ది విలేజ్‘ గుర్తింపు పొందింది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన కీలక అప్ డేట్స్ ఇచ్చారు మేకర్స్.


ఆడియెన్స్ లో భయం పుట్టిస్తున్న లేటెస్ట్ అప్ డేట్స్


ఇప్పటికే ‘ది విలేజ్‘ కు సంబంధించి ఆర్య ఫస్ట్ లుక్‌ను సిరీస్ హోస్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఆవిష్కరించింది. గతంలో ఎప్పుడూ లేనంత విచిత్రంగా కనిపించాడు ఆర్య. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ సైతం రివీల్ అయ్యింది. ఈ అనౌన్స్ సందర్భంగా విడుదల చేసిన రెండు వీడియోలు ఆడియెన్స్ లో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక వీడియోలో మనుషుల చేతులతో కూడిన మనిషి తల చెట్టు రూపంలో దర్శనం ఇచ్చింది. ’నీడలో దాగి ఉన్న రహస్యాలను వెలికితీయండి!’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ‘భయం లోతుల్లోకి వెళ్లేందుకు సాహసించండి!‘ అంటూ మరో వీడియో విడుదల చేశారు. ఇందులో సాయుధ దళాల మీద వింత మనుషులు దాడి చేయడం కనిపిస్తుంది. వారిని ఆర్య తన దగ్గరున్న ఆయుధంతో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు. ఈ వీడియోలు చూడ్డానికే భయంకరంగా ఉన్నాయి.










ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నా- ఆర్య


గత సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియో హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్ట పరంపర‘లో నటించిన ఆర్య, ప్రస్తుతం ఈ సిరీస్ కో ఎదుర చూస్తున్నారు. “‘సార్పట్ట పరంపర‘ సినిమాకు సంబంధించిన నాకు చాలా మంచి స్పందన లభించింది. ‘ది విలేజ్’ నా తొలి ఓటీటీ సిరీస్. ఇతర సిరీస్ లతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డాం. షూటింగ్ లో చాలా సవాళ్లు ఎదుర్కొన్నాం. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురు చూస్తున్నాం” అని ఆర్య వెల్లడించారు.  


‘ది విలేజ్’ సిరీస్ లో దివ్య పిళ్లై, ఆజియా, ఆడుకలం నరేన్, తలైవాసల్ విజయ్, ముత్తుకుమార్, కలై రాణి, జార్జ్ ఎం, జాన్ కొక్కెన్, అర్జున్ చిదంబరం, పూజ, జయప్రకాష్, పి.ఎన్ సన్నీ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆర్య చివరగా ‘సైంధవ్’ మూవీలో కీలక పాత్రలో కనిపించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్,అందాల తారలు రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా కీ రోల్స్ ప్లే చేశారు.


Read Also: మన హీరోలనూ వదలని డీప్‌ఫేక్ గాళ్లు, ఈ వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial